Site icon NTV Telugu

Netanyahu Trump AI Photo: ఏఐ మ్యానియా.. ట్రంప్‌కు నెతన్యాహు నోబెల్ ప్రదానం..

Netanyahu Trump Ai Photo,

Netanyahu Trump Ai Photo,

Netanyahu Trump AI Photo: 2025 నోబెల్ శాంతి బహుమతిని ఎవరు అందుకుంటారనేది రేపు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై మను మళ్లింది. దీంతో ఆయన ట్రంప్ తనను తాను ఈ అవార్డుకు అర్హుడని భావిస్తున్నారు. సందర్భం దొరికిన ప్రతీసారి ప్రపంచ వేదికలపై ఆయన తాను ఈ పురస్కారానికి అర్హుడని పదే పదే పేర్కొన్నారు. ఈ అవార్డు ప్రకటనకు కేవలం ఒక రోజు ముందు.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌తో కలిసి ఉన్న AI ఫోటోను ఎక్స్‌లో పంచుకున్నారు. ఇది సాధారమైన ఫోటో కాదు..

READ ALSO: Nalgonda Crime: మాయమాటలు చెప్పి బాలికను స్నేహితుడి రూమ్‌కు తీసుకెళ్లిన కామాంధుడు.. చివరకు?

ట్రంప్‌కు నోబెల్ అందజేసిన నెతన్యాహు..
ఈ ఫోటోలో నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి పతకాన్ని ప్రదానం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ AI చిత్రంలో ట్రంప్ పురస్కారాన్ని స్వీకరించడానికి సంతోషంగా చేతులు పైకెత్తుతున్నారు. ఈ ఫోటోకు నెతన్యాహు “నోబెల్ శాంతి బహుమతికి ఆయన (ట్రంప్) అర్హుడు” అనే వ్యాఖ్యను జత చేశారు. నిజానికి 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడానికి కేవలం ఒక రోజు ముందు ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక మొదటి దశకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం నివేదికల ప్రకారం.. డోనాల్డ్ ట్రంప్ ఆదివారం జెరూసలేంలో ఉండవచ్చని పేర్కొన్నాయి. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు, యుఎస్ వైట్ హౌస్ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు “ది పీస్ ప్రెసిడెంట్” అనే కొత్త బిరుదును ఇచ్చింది.

తన వాణిజ్య దౌత్యంతో అనేక దేశాలలో యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ ఇటీవల నెలల్లో పదే పదే చెప్పారు. భారతదేశం – పాకిస్థాన్ సంఘర్షణను నివారించడంలో ఆయన పాత్ర ఉందని చెప్పుకున్నారు. కానీ ఆయన ప్రకటనలను భారతదేశం ఖండించింది. ప్రపంచం ముందు ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పలకు భిన్నంగా అమెరికాలో ఆయన ఉంది. ఆయన పదవీకాలంలో అనేక వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయి.

READ ALSO: MacBook Air M4 Discount: ఆపిల్ మ్యాక్‌బుక్‌పై భారీ తగ్గింపు.. ఎన్ని వేల డిస్కౌంట్‌ తెలుసా!

Exit mobile version