AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..

  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎసరుపెడుతున్న ఏఐ..
  • 18 ఏళ్ల అనుభవం ఉద్యోగికి ఉద్వాసన..
  • కుటుంబం కోసం వెయిటర్‌గా ఉద్యోగం..
Ai Story

Ai Story

AI Viral Story: టెక్ రంగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చిన తర్వాత టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మానవజీవితం మరింత సులువు అవుతోంది. ఇదే సమయంలో ఏఐ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు అన్ని కంపెనీలు తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.

తాజాగా ఉద్యోగం కోల్పోయిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన పరిస్థితిని వివరిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. దాదాపు 18 ఏళ్లు అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఏఐ కారణంగా తన ఉద్యోగం పోయిందని పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను మెక్‌డొనాల్డ్స్ వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు రెడ్డిట్ పోస్ట్‌లో రాశారు.

Read Also: Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!

తాను 18 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశానని, అయితే 8 నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు చెప్పాడు. కంపెనీ 12 మంది ఇంజనీర్ల టీమ్‌ను తొలగించి, ఇద్దరు ఏఐ నిపుణుల్ని నియమించుకుందని, అప్పటి నుంచి 100కు పైగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నప్పటికీ, ఇంకా కొత్త ఉద్యోగం రాలేదని చెప్పారు. ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇంటి రెంట్ చెల్లించడానికి మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇంటర్వ్యూల్లో అనేక అనుభవవాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాను చెప్పే సమాధానాలతో ఇంటర్వ్యూయర్లు నచ్చడం లేదని, డెవలపర్ల పని అయిపోయిందని, కంప్యూటర్ సైన్స్ డిగ్రీకి ఇప్పుడు విలువ లేదని నిర్మొహమాటంగా చెబుతున్నారని అతను వెల్లడించారు. తన లాంటి చాలా మంది ఇంజనీర్లు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

ఇప్పుడు ఏఐ వల్ల కంపెనీలు తక్కువ మందితో పనికానిచ్చేస్తోందని, ఎక్కువ మంది ఉద్యోగుల్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏఐ టూల్స్ ఉపయోగించాలని చాలా కంపెనీలు కోరతున్నాయి. ప్రస్తుతం టెక్ రంగం ఏఐపై పట్టు సాధిస్తేనే ఉద్యోగాలు ఉండే పరిస్థితి నెలకొంది. ఇంటర్వ్యూల్లో ఏఐ గురించి, దాని ఉపయోగించడం గురించి తెలియని వాళ్లు వెనకబడిపోతున్నారు.