హైదరాబాద్‌కు చెందిన ఈక్వల్ AI కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కాలర్ అసిస్టెంట్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ అక్టోబర్ 2 నుండి అందుబాటులోకి వస్తుంది. ఢిల్లీ NCRలో మొదటి 10,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్చి 2026 నాటికి ప్రతిరోజూ 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యం అని కంపెనీ వ్యవస్థాపకుడు CEO కేశవ్ రెడ్డి అన్నారు. ఈ యాప్ తెలియని కాల్స్ కు సమాధానం ఇస్తుంది. స్పామ్ కాల్‌లను నివారిస్తుంది.
Also Read:World Cup 2025: వన్డే ప్రపంచకప్‌లో భారత్ బోణీ.. ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్!
ఈక్వల్ AI కాలర్ అసిస్టెంట్ తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్‌లకు ఆటోమేటిక్ గా సమాధానం ఇస్తుంది. ఇది కాలర్‌ను గుర్తిస్తుంది. కాల్ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటుంది. తర్వాత అది కాల్‌ను కనెక్ట్ చేస్తుంది. సందేశాన్ని తీసుకుంటుంది లేదా ఫిల్టర్ చేస్తుంది. AI కాల్ అసిస్టెంట్ హిందీ, ఇంగ్లీష్, హింగ్లిష్ భాషలలో మాట్లాడుతుంది. ఈ యాప్ వినియోగదారుకు పూర్తి కాల్ వివరాలను అందిస్తుంది. ఇది ఇతర స్పామ్ డిటెక్టర్ యాప్‌ల నుండి భిన్నంగా ఉంటుంది. ఇది కాలర్‌తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది.
Also Read:Minor Rape Case: చిత్తూరులో ప్రేమజంటపై దాడి.. మైనర్ బాలికపై అత్యాచారం..
ఈక్వల్ AI దాని AI-ఆధారిత కాలర్ అసిస్టెంట్‌ను కూడా పరీక్షించింది. ఇది గుర్తు తెలియని కాల్‌లను 87% తగ్గించింది. డెలివరీ కాల్ సమయాలను 73% తగ్గించింది. 94% స్పామ్ కాల్‌లను దోషరహితంగా గుర్తించింది. వినియోగదారు కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయబడిన నంబర్‌ల నుండి వచ్చే కాల్‌లకు యాప్ స్పందించదు. వినియోగదారులు ముఖ్యమైన కాల్‌లను మిస్ కాకుండా చూసుకుంటుంది.
