Site icon NTV Telugu

Daily Series Mr.Pellam: మహిళల కోసం ‘ఆహా’ డైలీ సిరీస్

Mr.pellam

Mr.pellam

Daily Series Mr.Pellam: వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ శతివిధాల ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు, టాక్ షోస్, మ్యూజికల్ షోస్, కుకింగ్ షోస్, డాన్స్ షోస్ తో పాటు కామెడీ షోస్ కూడా చేస్తూ వచ్చిన ‘ఆహా’ ఇప్పుడు మహిళలను ఆకట్టుకోవడానికి డైలీ సిరీస్‌ను కూడా మొదలు పెట్టింది. టీవీ డ్రామాలను ఇష్టపడే మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి ‘మిస్టర్ పెళ్ళాం’ పేరుతో డైలీ తెలుగు సీరీస్ అందిస్తోంది. ఈ సిరీస్ ను నవంబర్ 28 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం చేస్తూ వస్తోంది.

Arun Vijay: ఓరి దేవుడో… వాటికి ‘ఆక్రోశం’ తోడైందిగా!

సింగిల్ డౌన్ లోడ్ కన్వినెన్స్ తో ఈ సిరీస్ అందిస్తున్నట్లు ఆహా సి.ఇ.వో అజిత్ ఠాగూర్ చెబుతున్నారు. ఈ డెయిలీ సిరీస్ లో పూజా మూర్తి, అమర్ దీప్, సోనియా ముఖ్య పాత్రధారులు. పెళ్ళి కోసం కలలు కంటూ తనలాగే ప్రేమించే భర్త కోసం కలలు కనే ఓ అమ్మాయి, ధనవంతురాలిని పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలనుకునే అబ్బాయి, డబ్బుకంటే ప్రేమను కోరుకునే మరో అమ్మాయి… ఈ ముగ్గురి మధ్య నడిసే కథే ఈ డైలీ సిరీస్. ‘కార్తీక దీపం’ సీరియల్ తీసిన గగన్ టెలీ షో ఈ ‘మిస్టర్ పెళ్ళాం’ను తీస్తుండటం విశేషం.

Exit mobile version