Site icon NTV Telugu

PM Kisan Payment Date 2026: రైతన్నలకు శుభవార్త.. PM కిసాన్ డబ్బులు అకౌంట్‌లో ఎప్పుడు పడుతాయంటే?

Pm Kisan 22nd Installment

Pm Kisan 22nd Installment

PM Kisan Payment Date 2026: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు 22వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర విడుదల చేసే డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడుతాయని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం హోలీకి ముందు రైతుల ఖాతాలకు రూ.2 వేలు బదిలీ చేయవచ్చని అంటున్నారు. ఈ విడత ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండవ వారంలో విడుదల కావచ్చని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 11, 2026న రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అధికారిక తేదీని విడుదల చేయలేదు.

READ ALSO: T20 World Cup: యూ-టర్న్ డ్రామా.. పాకిస్తాన్‌ను ఐసీసీ ఎలా దారికి తెచ్చింది..?

ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏటా రూ.6,000 ఇస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం ఒకేసారి చెల్లించదు. కానీ ఒక్కో దఫాలో రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా చెల్లిస్తుంది. ఈ డబ్బును DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులు తమ వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి రైతు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందరు.

ప్రభుత్వం కొంతమంది రైతులను ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒక రైతు ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేస్తే, వారికి పీఎం కిసాన్ డబ్బులు చెల్లించక పోవచ్చు. అలాగే భార్యాభర్తలిద్దరూ లేదా ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులకు PM కిసాన్ ప్రయోజనాలను పొందుతుంటే వారికి చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భాలలో ప్రభుత్వం భౌతిక ధృవీకరణను నిర్వహిస్తుంది. ఈ ధృవీకరణ పూర్తయ్యే వరకు, పీఎం కిసాన్ ప్రయోజనాలు తాత్కాలికంగా నిలిపి వేస్తారు. కొన్నిసార్లు, ఆధార్, బ్యాంక్ ఖాతా లేదా భూమికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాల కారణంగా చెల్లింపులు ఆగిపోతాయి.

రైతులు కేంద్రం మంజూరు చేస్తున్న PM కిసాన్ ప్రయోజనాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ అందుబాటులో ఉంది. అందులో చెక్ చేసుకోవచ్చు. లేదంటే రైతులు తమ వాయిదా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోడానికి, అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి eMitra చాట్‌బాట్‌ను కూడా ఉపయోగించవచ్చు. PM-KISAN పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు. దీని ప్రాథమిక లక్ష్యం చిన్న, సన్నకారు రైతులకు అప్పులు చేయకుండా వారి వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, గృహ అవసరాలను తీర్చగలిగేలా ఆర్థిక సహాయం అందించడం.

READ ALSO: Balakrishna – Harish Shankar: గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా..! టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ లోడింగ్?

Exit mobile version