Site icon NTV Telugu

Agni 5 missile test: విజయవంతమైన అగ్ని 5.. ఇక శత్రు దేశాలకు వణుకే..

07

07

Agni 5 missile test: భారతదేశం బుధవారం అగ్ని-V ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5500 కి.మీ. వరకు ఉంది. దీంతో భారత్ ఇప్పుడు చైనా లేదా పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలదు. ఈ క్షిపణితో కేవలం ఆసియాలో మాత్రమే కాకుండా, యూరప్, ఆఫ్రికాలపై కూడా దాడి చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ క్షిపణికి అణు బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. దీనిని దాదాపు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్‌బిఎం) ‘అగ్ని-5’ ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

READ MORE: Vaishnavi Murder Case: గండికోటలో బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్‌..

క్షిపణి ప్రధాన బలాలు..
అగ్ని-5 అతిపెద్ద బలం దాని పరిధి. ఈ క్షిపణి పరిధి 5500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ నుంచి ఇస్లామాబాద్, కరాచీ వరకు అన్నీ ఇప్పుడు భారతదేశం గురికి చిక్కినట్లే. ఆసియాను మాత్రమే కాకుండా యూరప్, ఆఫ్రికాలోని పెద్ద ప్రాంతాలను కూడా ఈ క్షిపణి కవర్ చేయగలదు. ఈ క్షిపణి శత్రువు క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థను తప్పించుకునేలా రూపొందించబడింది. అధునాతన నావిగేషన్ వ్యవస్థ దీనిని ఏ రాడార్‌కు చిక్కకుండా చేస్తాయి.

అగ్ని-5 దేశ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీనిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. ఇది 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు గల అత్యాధునిక సాంకేతికతతో కూడిన క్షిపణి. ఇది అణ్వాయుధాలతో కూడిన 1 టన్ను పేలోడ్‌ను మోయగలదు. దీనిని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించేలా రూపొందించారు. అగ్ని-V కి త్వరలో MIRV (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెట్ చేయగల రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీని జోడించనున్నారు. దీని తరువాత ఒకే క్షిపణి నుంచి బహుళ వార్‌హెడ్‌లను వేర్వేరు ప్రదేశాలపై ప్రయోగించవచ్చు.

కొత్త నాన్-న్యూక్లియర్ వెర్షన్‌కు సన్నాహాలు..
అగ్ని-5 క్షిపణి కొత్త నాన్-న్యూక్లియర్ వెర్షన్‌ను తయారు చేయడానికి DRDO సన్నాహాలు ప్రారంభించింది. దీనిని ప్రత్యేకంగా వైమానిక దళం కోసం తయారు చేస్తున్నట్లు DRDO అధికారులు తెలిపారు. ఇది దాదాపు 8 టన్నుల బరువైన వార్‌హెడ్‌ను కలిగి ఉంటుంది. దీనిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. మొదటిది – ఎయిర్‌బర్స్ట్ అంటే క్షిపణి గాలిలో పేలిపోతుంది. రన్‌వే, ఎయిర్‌బేస్, రాడార్ వ్యవస్థను నాశనం చేస్తుంది. రెండవది- బంకర్ బస్టర్ వార్‌హెడ్. ఇది భూమి లోపలికి 80 నుంచి 100 మీటర్ల వరకు చొచ్చుకుపోయి శత్రువు కమాండ్ సెంటర్ లేదా అణ్వాయుధాలు నిల్వ చేసిన ప్రదేశాన్ని నాశనం చేస్తుంది. ఈ క్షిపణి పరిధి 2500 కి.మీ ఉంటుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

READ MORE: Jaish-e-Mohammed fundraising: బీభత్సానికి నిధుల సేకరణ.. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ కొత్త ప్లాన్

Exit mobile version