అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ గత ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఏజెంట్ మూవీకి స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ కథతో దాదాపు ఎనభైకోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాదాపు రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఏజెంట్ మూవీ పై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిలైంది. ఏజెంట్ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు.ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు.కానీ అఖిల్ శ్రమకి ఫలితం దక్కలేదు.భారీ నష్టాలను మిగిల్చిన ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఏడాది కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అఖిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సోనీలివ్ రెండు సార్లు అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. కానీ లీగల్ ఇష్యూస్ కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు.తమకు సమాచారం ఇవ్వకుండా ఏజెంట్ హక్కులను సోనీలివ్‌కు నిర్మాత అనిల్ సుంకర అమ్ముకున్నాడంటూ వారు ఆరోపించారు. ఆ కేసు కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో చాలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది . అది కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ఆలస్యానికి కారణమని అంటున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది.ఈ నెలలోనే అఖిల్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు చెబుతున్నారు. జనవరి 26 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవనున్నట్లు సమాచారం.. త్వరలోనే ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోనీలివ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
