Site icon NTV Telugu

Bomb threat: దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

Airport

Airport

దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రాయాల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని వడోదర ఎయిర్‌పోర్టుకు, బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టుకు, రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా సమాచారం రాగానే భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: YS Jagan Pulivendula Tour: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు..కారణమేంటంటే?

ఇక జైపూర్‌లోని ఒక కాలేజీకి కూడా బెదిరింపు వచ్చింది. అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు. గతంలో కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల ఢిల్లీ, బెంగళూరు ఎయిర్‌పోర్టులు, కాలేజీలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి అదే తరహాలో బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: Renuka Swamy Case: ఎవర్రా ఈ పవిత్ర గౌడ? టాప్ ట్రెండింగ్లోకి దర్శన్ ప్రియురాలు

Exit mobile version