Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story After Tech Giants Boeing Plans To Cut About 2000 Jobs In 2023

Boeing layoff: బోయింగ్‌లోనూ ఉద్యోగాల కోత.. 2000 మందికి ఉద్వాసన!

Published Date :February 7, 2023 , 7:20 pm
By Nishanth Munjala
Boeing layoff: బోయింగ్‌లోనూ ఉద్యోగాల కోత.. 2000 మందికి ఉద్వాసన!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉద్యోగాల కోత ఇప్పట్లో ముగిసేలా లేదు. టాప్ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ బాట పడుతున్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకంగా రెండు, మూడుసార్లు ఉద్యోగాల కోతకు రెడీ అంటున్నాయి. తాజాగా ఇదే బాటలో చేరింది ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్. దాదాపు 2000 మంది ఉద్యోగులను తీసేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసుకునే ఆలోచన చేస్తుందట. ఫినాన్స్, హెచ్‌ఆర్ వర్టికల్స్‌లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. ఈ లేఫ్స్‌లోని మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టీసీఎస్)కు అప్పగించినట్లు మీడియా నివేదించింది. బోయింగ్ ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3,500 మంది ప్రత్యక్ష ఉద్యోగులను కలిగి ఉంది. భారతదేశంలో టాటా గ్రూప్‌తో సహా దాని సరఫరాదారుల వద్ద మరో 7,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Also Read: WhatsAPP: వాట్సాప్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!

గతేడాది దాదాపు 15000 మందిని ఉద్యోగులను నియమించుకున్నట్లు చెప్పిన బోయింగ్.. ఈ సంవత్సరంలో మరో 10,000 మందిని రిక్రూట్‌ చేసుకుంటామని తెలిపింది. మరోవైపు గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలోనే బోయింగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018 అక్టోబరులో లైయన్‌ ఎయిన్‌ ఫ్లైట్‌ 610 టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 189 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 2019లో జరిగిన మరో ఘటనలో ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానం టేకాఫ్‌ ఆయిన ఆరు నిమిషాలకే క్రాష్‌ అయ్యింది. ఈ ఘటనలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు భారీ సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విమాన తయారీలో లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రధానంగా ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపం కొట్టుకొచ్చినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే తయారీపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన బోయింగ్‌.. ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Natasha Perianayagam: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ-అమెరికన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Boeing cut 2000 jobs
  • Boeing latest news
  • Boeing layoffs
  • Boeing layoffs news
  • IT layoffs

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions