ఉద్యోగాల కోత ఇప్పట్లో ముగిసేలా లేదు. టాప్ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ బాట పడుతున్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకంగా రెండు, మూడుసార్లు ఉద్యోగాల కోతకు రెడీ అంటున్నాయి. తాజాగా ఇదే బాటలో చేరింది ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్. దాదాపు 2000 మంది ఉద్యోగులను తీసేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసుకునే ఆలోచన చేస్తుందట. ఫినాన్స్, హెచ్‌ఆర్ వర్టికల్స్‌లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. ఈ లేఫ్స్‌లోని మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టీసీఎస్)కు అప్పగించినట్లు మీడియా నివేదించింది. బోయింగ్ ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3,500 మంది ప్రత్యక్ష ఉద్యోగులను కలిగి ఉంది. భారతదేశంలో టాటా గ్రూప్‌తో సహా దాని సరఫరాదారుల వద్ద మరో 7,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Also Read: WhatsAPP: వాట్సాప్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!
గతేడాది దాదాపు 15000 మందిని ఉద్యోగులను నియమించుకున్నట్లు చెప్పిన బోయింగ్.. ఈ సంవత్సరంలో మరో 10,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. మరోవైపు గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలోనే బోయింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018 అక్టోబరులో లైయన్ ఎయిన్ ఫ్లైట్ 610 టేకాఫ్ అయిన 13 నిమిషాలకే జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 189 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 2019లో జరిగిన మరో ఘటనలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం టేకాఫ్ ఆయిన ఆరు నిమిషాలకే క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు భారీ సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విమాన తయారీలో లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రధానంగా ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం కొట్టుకొచ్చినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే తయారీపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన బోయింగ్.. ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Natasha Perianayagam: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ-అమెరికన్