NTV Telugu Site icon

Sniffer Dog Delivers: మూడు పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్‌.. విచారణకు ఆదేశించిన న్యాయస్థానం

Sniffer Dog

Sniffer Dog

Sniffer Dog Delivers 3 Puppies: మేఘాలయలోని స్నైఫర్ డాగ్‌లలో ఒకటి మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సరిహద్దు భద్రతా దళం కోర్టు విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి ఈ విషయంపై నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 19న స్టేషన్ హెడ్ క్వార్టర్స్ బీఎస్‌ఎఫ్‌ షిల్లాంగ్ ఆర్డర్‌కు అనుగుణంగా.. యూనిట్‌లోని డిప్యూటీ కమాండెంట్ ఒక సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని నిర్వహించి ఆడ కుక్క లాల్సీ ప్రసవించిన పరిస్థితులను పరిశోధిస్తారు. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బోర్డర్ అవుట్ పోస్ట్ బాగ్మారా వద్ద ఆ కుక్క మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

BIG BREAKING : మరో మూడు నోటిఫికేషన్‌లు విడుదల చేసిన TSPSC

“అన్ని విధాలుగా పూర్తి చేసిన సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ప్రొసీడింగ్‌ను 30 డిసెంబర్ 2022 నాటికి స్టేషన్ హెడ్ క్వార్టర్స్ బీఎస్‌ఎఫ్‌ షిల్లాంగ్‌కు సమర్పించాలని ఆ ఆర్డర్‌లో వెల్లడించింది. ఉన్నత శిక్షణ పొందిన బీఎస్‌ఎఫ్‌ కుక్కలను వాటి హ్యాండ్లర్ల పర్యవేక్షణలో ఉంచుతామని, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి తెలియజేశారు. “ఈ కుక్కలు ఎప్పుడూ ఇతర కుక్కలతో సంబంధంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో పెంపకం జరుగుతుంది” అని సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. ఈ కుక్కను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధుల్లో మోహరించారు.