Shikhar Dhawan In LLC: ఇటీవల భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్ ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లో ఆడబోతున్నాడు. ఈ లీగ్‌లో మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారని తెలిసిందే. కాబట్టి LLC ద్వారా గబ్బర్ అభిమానులు మరోసారి ఆయన బ్యాటింగ్ చేయడాన్ని చూడగలరు.
CM Chandrababu: ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
ఇక ఈ విషయాన్నీ.., లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా.. ధావన్‌ను లీగ్‌కి స్వాగతిస్తూ, శిఖర్ ధావన్ మాతో చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. అతని అనుభవం, ప్రతిభ నిస్సందేహంగా లీగ్‌ని మెరుగుపరుస్తుంది. ఇంకా క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. అతను చేరడం కోసం మేము ఎదురుచూస్తున్నాము. అతను లెజెండ్స్ తో ఆడటం కోసం క్రికెట్ ఎదురుచూస్తోంది అంటూ తెలిపాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ తదుపరి సీజన్ సెప్టెంబర్ 2024లో ప్రారంభం కాబోతోంది.
BCCI Secretary: జై షా వారసుడు ఎవరు?.. రేసులో మరో బీజేపీ నేత కుమారుడు!
ఇకపోతే ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో అతను 40.61 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో తన 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 190 పరుగులు. ODIలో 167 మ్యాచ్‌లలో 164 ఇన్నింగ్స్‌లలో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలతో 6,793 పరుగులు చేశాడు. సగటు 44.11. ఇక టి20లో, 68 మ్యాచ్ లలో 27.92 సగటుతో 1,759 పరుగులు చేశాడు. ఇక ధావన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 122 మ్యాచ్‌లలో 202 ఇన్నింగ్స్ లలో 8,499 పరుగులు చేశాడు. సగటు 44.26. ఇందులో 25 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ స్కోరు 224 పరుగులు. అలాగే లిస్ట్-ఎ క్రికెట్ లో 302 మ్యాచ్ లు ఆడాడు. అతని 298 ఇన్నింగ్స్ లలో 12,074 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 67 అర్ధ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 248 పరుగులు.