NTV Telugu Site icon

Shivraj Singh: ఎమ్మెల్యే పదవికి శివరాజ్ సింగ్ రాజీనామా

Se

Se

కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు. జూన్ 9న కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలను మోడీ కేటాయించారు. దీంతో మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బుధని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Viral Video: వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌.. నానా పటోలే ఏం చేశారంటే..!

బుధని నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా సేవలందించానని, ప్రజల అభిమానం చూరగొనేందుకే తన యావజ్జీవితం అంకితం చేసినట్లుగా చెప్పారు. తన శక్తి మేరకు ప్రజా సేవకు పునరంకితమవుతానని చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు శివరాజ్ సింగ్ సేవలందించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నుంచి 8.21 లక్షలకు పైగా ఓట్లతో ఆయన గెలిచారు.

ఇది కూడా చదవండి: Sikkim Tourists: సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యటకులు సేఫ్..