Site icon NTV Telugu

Noida: ఢిల్లీ తరహాలో మరో ఘటన.. స్టూడెంట్లపైకి దూసుకొచ్చిన కారు

Noida

Noida

Noida: రెండ్రోజుల కిందట ఢిల్లీ శివారులోని కాంజావాల్‌ ప్రాంతంలో ఓ యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం ఎంతటి సంచలనమైందో తెలిసిందే. ఈ అమానవీయ ఘటన మరవకముందే.. అలాంటిదే మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్‌ నోయిడాలో అతివేగంగా వచ్చిన ఓ కారు ముగ్గురు విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురు విద్యార్థినులు గ్రేటర్‌ నోయిడాలోని కైలాష్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. కాగా, బాధితుల్లో స్వీటీ కుమారి అనే విద్యార్థినికి తల, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వీరంతా బీటెక్‌ చదువుతున్నారు. ప్రస్తుతం స్వీటీ కోమాలోకి వెళ్లిపోయిందని ఆమె సోదరుడు సంతోష్‌ కుమార్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

Read Also:Tiger Attack : వెన్నులో వణుకు పుట్టించే ఘటన.. సర్కస్‎లో వ్యక్తి మెడ కొరికేసిన పులి

ఇప్పటి వరకు ఆమె చికిత్సకు రూ.లక్ష ఖర్చు అయ్యిందని.. ఆమె కోలుకోవాలంటే మరో రూ.పది లక్షలు అవసరమని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు దాతలు చేయూత అందించాల్సిందిగా అభ్యర్థించారు. ‘నా పేరు సంతోష్‌ కుమార్‌. నా సోదరి స్వీటీ కుమారి కోసం నేను ఫండ్స్‌ రైజ్‌ చేస్తున్నాను. తను గ్రేటర్‌ నోయిడాలోని జీఎన్‌ఐఓటీ కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. యాక్సిడెంట్ తో కోమాలోకి వెళ్లిపోయింది. గ్రేటర్‌ నోయిడాలోని కైలాష్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని వైద్యులు సూచించారు. ఇప్పటి వరకు మాకు రూ.లక్ష వరకు ఖర్చు అయ్యింది. తదుపరి చికిత్స కు మరో రూ.పది లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దయచేసి సాయం చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

Exit mobile version