Site icon NTV Telugu

Shaheen Afridi: కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై..?

Afridi

Afridi

పాకిస్తాన్ టీ20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. కాగా.. తన కెప్టెన్సీలో పాకిస్తాన్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ.. ఆయన వైదొలుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు పీసీబీ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజమ్ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Read Also: Family Star: ఏంటీ ఫ్యామిలీ స్టార్ బయోపిక్కా? కొండన్న ఇలా లీక్ చేసేశాడు ఏంటి?

ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్‌ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్‌ జకా అష్రఫ్.. పాక్‌ టెస్టు కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి బాధ్యతలు అప్పగించారు. అయితే, కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకున్నాక పాకిస్తాన్‌ టీమ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొత్త కెప్టెన్‌లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలకు వెళ్లిన పాక్.. అక్కడ ఘోర ప్రదర్శన కనబరిచింది. మసూద్‌ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో 3 టెస్టులు వైట్‌వాష్‌ కాగా, అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో చేజార్చుకుంది.

Read Also: Summer Food: వేసవిలో ఈ ఫుడ్‌ ఎక్కువగా తినొద్దు..!

ఈ పేలవమైన ప్రదర్శనతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జనవరి నెలలో జకా అష్రఫ్ పీసీబీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొవడంతో అష్రఫ్ స్ధానాన్ని మొహ్సిన్ నఖ్వీ భర్తీ చేశాడు.దీంతో పాక్‌ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు, ఇక రానున్న టీ20 వరల్డ్ కప్ ద్రుష్టి లో పెట్టుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ బాబర్‌ ఆజంకే అప్పగించింది.

Exit mobile version