NTV Telugu Site icon

Shocking Video: టూరిస్టుల ముందే సింహం చెలరేగిపోయింది.. తీరా చూస్తే..!

Lion

Lion

సింహం.. అడవికి రారాజు. అది గాండ్రించిందంటే ఏ జంతువైనా.. ఏ మనిషైనా హడలెత్తిపోవల్సిందే. ఎంత పెద్ద జంతువైనా లయన్ ముందు బలాదూరే. అయితే అన్ని సార్లు తమ ప్రతాపం చూపించడం కుదరదని ఈ సీన్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఓ దున్నపోతు సింగిల్‌గా సింహం కంటికి కనబడింది. అంతే ఈ రోజు మంచి బిర్యానీ భోజనం దొరికిందిలే అనుకుంది. ఇంకేముంది అమాంతంగా వచ్చి దున్నపోతు పీక పట్టుకుంది. ప్రాణం పోగానే కడుపు నిండా ఆరగించాలని చూసింది. కానీ దాని వేషాలు దున్నపోతు ముందు ఏ మాత్రం సాగలేదు. ఓ వైపు సింహం తన పీక పట్టుకుని వదలకపోయినా.. దానితో చివరి దాకా పోరాడుతూనే ఉంది దున్నపోతు. అలా పెనుగులాడుతూ… ఆడుతూ మొత్తానికి సింహం నోట నుంచి తప్పించుకుంది. అంతేకాదు.. ఆ తర్వాత లయన్‌కు దున్నపోతు చుక్కలు చూపించింది. తన కొమ్ములతో పొడిచి చంపేందుకు వెంటాడి.. వేటాడి పరుగెత్తించింది. ఇంకేముంది ప్రాణభయంతో సింహం అక్కడ నుంచి పరారైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆఫ్రికాలోని (Africa) ఓ అడవిలో రైడ్‌కు వెళ్లిన టూరిస్టులకు ఈ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియోను పర్యాటకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.