Richest Chief Minister in India: భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో ఓ నివేదిక తేల్చేసింది.. అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? ఏడీఆర్ సర్వే రిపోర్ట్ ప్రకారం అత్యల్ప మొత్తం ఆస్తులున్న సీఎం ఎవరు? కూడా తేలిపోయింది.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులందరి ఆర్థిక స్థితిపై వారి తాజా నివేదికను విడుదల చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం మొత్తం రూ.510 కోట్ల ఆస్తులతో రాష్ట్ర ప్రభుత్వాల సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు.. ఇక, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.163 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉండగా.. ఆయన ఆస్తుల విలువ రూ.63 కోట్లుగా ఉంది..
Read Also: Deputy CM Narayana Swamy: దళితుడిననే కదా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు.. డిప్యూటీ సీఎం ఆవేదన..
30 మంది ముఖ్యమంత్రులు, 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 29 మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులున్న కోటీశ్వరులే. కోటి రూపాయల లోపు ఆస్తులున్న ఏకైక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ సీఎం అయిన ఆమె ఆస్తులు రూ. 15 లక్షలు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విశ్లేషించిన పోల్ అఫిడవిట్ల ప్రకారం, 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రులలో ఇరవై తొమ్మిది మంది కోటీశ్వరులు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జగన్ మోహన్ రెడ్డి అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. విశ్లేషించిన 30 మంది సీఎంలలో 29 మంది అంటే 97 శాతం కోటీశ్వరులని, ప్రతి సీఎంకు సగటు ఆస్తులు రూ.33.96 కోట్లు అని ADR పేర్కొంది.
Read Also: Opposition Unity: నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!
మరోవైపు.. ADR నివేదిక ప్రకారం, 30 మంది సీఎంలలో 13 మంది (43 శాతం) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ మరియు క్రిమినల్ బెదిరింపులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఐదేళ్లకు పైగా జైలు శిక్షతో కూడిన నాన్ బెయిలబుల్ నేరాలు అని నివేదిక పేర్కొంది. ఏడీఆర్ ప్రకారం ఆస్తుల పరంగా మొదటి మూడు స్థానాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ (రూ.510 కోట్లకు పైగా), అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన పెమా ఖండూ (రూ.163 కోట్లకు పైగా) రెండో స్థానంలో, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లకు పైగా) మూడో స్థానంలో నిలిచారు.. అత్యల్పంగా ఆస్తులు కలిగిన ముగ్గురు సీఎంల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ (రూ. 15 లక్షలకు పైగా), కేరళకు చెందిన పినరయి విజయన్ (రూ. 1 కోటికి పైగా), హర్యానాకు చెందిన మనోహర్ లాల్ (రూ. 1 కోట్లకు పైగా) ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ తెలిపింది.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రూ.3 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది.