Sai Marthand: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచారు. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న శేష్ తాజాగా తన కొత్త సినిమా డెకాయిత్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. శేష్ నెక్ట్స్ సినిమా తనతోనే అని కన్ఫార్మ్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం రాబోతున్నట్లు ఈ వేదికపై అధికారికంగా ప్రకటించారు.
READ ALSO: OTR: ఉద్యోగులు vs మండలి.. దుర్గమ్మ ఆలయంలో అధికార దర్పం.?
గతేడాది (2025) విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లిటిల్ హార్ట్స్’తో సాయి మార్తాండ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మౌలి తనుజ్, శివాని నాగారం ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.40 కోట్లు వసూలు చేసి ఘనవిజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఈ డైరెక్టర్‌తో శేష్ కొలాబరేషన్ పై అప్పట్లోనే రూమర్స్ స్టార్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, నరేషన్ ఇప్పటికే పూర్తయిందని, గూఢచారి 2 సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అడివి శేష్ అంటే థ్రిల్లర్స్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అయితే సాయి మార్తాండ్ తన మొదటి చిత్రంతో లవ్ & కామెడీ ఎలిమెంట్స్‌ను హ్యాండిల్ చేయడంలో దిట్ట అని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ లేదా రొమాంటిక్ డ్రామాగా ఉండే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.
READ ALSO: Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!
