NTV Telugu Site icon

Biggboss 8: మిడ్ వీక్ ఎలిమినేషన్.. అంతాకలిసి ఆదిత్య ఓంని పంపించారుగా

New Project (51)

New Project (51)

Biggboss 8: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తోంది. మొదట్లో మొఖం కూడా తెలియని కంటెస్టెంట్లను తీసుకొచ్చారని జనాలు కాసింత అసహనం ప్రదర్శించిన మాట వాస్తవమే. కానీ అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ కాన్సెప్ట్ తో ఊహించని ట్విస్టులతో రోజు రోజుకు చూస్తున్న ప్రేక్షకులకు బాగానే క్యూరియాసిటీ పెంచుతున్నారు నిర్వాహకులు. ఇప్పటికే 32రోజులు గడిచి పోయాయి. తొలిరోజు 14మంది కంటెస్టెంట్లు హౌసులోకి వెళ్లగా.. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ బాష, మూడో వారం అభయ్, నాలుగో వారం సోనియా ఆకులు ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చేశారు. కానీ లాస్ట్ ఆదివారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్, మరొకటి ఆదివారం ఎలిమినేషన్, ఆయన చెప్పినట్లుగానే గురువారం రాత్రి అనూహ్యంగా ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను బిగ్ బాస్ హౌసు నుంచి బయటకు పంపించేశాడు.

Read Also:Tummala Nageswara Rao : రుణమాఫీపై వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు గానీ.. మంచి పేరు తెచ్చుకుని బయటకు వచ్చామా? లేదా? అన్నదే ముఖ్యం. అలాంటి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎన్ని కంత్రీ పనులు చేసినా.. గ్రూప్ గేమ్స్ ఆడినా.. వాటిని పట్టించుకోకుండా తమ మంచితనాన్ని మెయింటైన్ చేశారు. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ, మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తుండటంతో కన్నడ కంత్రీ బ్యాచ్ చేష్టలకు ఆదిత్య బలైయ్యారు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అర్థరాత్రి సమయంలో జరిగింది. కంటెస్టెంట్లందరినీ… ఎవరైతే నామినేషనల్లో ఉన్నారు వారిని గార్డెన్ ఏరియాకు రప్పించి బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు.

Read Also:UP: యూపీలో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులు హత్య

నిన్నటి ఎపిసోడ్ లో ఆరుగురు నామినేషన్లలో ఉండగా ప్రేక్షకుల అత్యధిక ఓటింగ్ కారణంగా నబీల్, నిఖిల్, మణికంఠ టాప్‌లో ఉండటంతో వారు సేవ్ అయ్యారు. మిగిలిన ముగ్గురు అంటే.. ఆదిత్య ఓం, నైనికా, విష్ణు ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను హౌస్ మెట్స్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే.. ఓటింగ్‌లో మణికంఠ అతి తక్కువగా ఉంటే కంటెస్టెంట్స్ అందరూ.. మణికంఠనే ఎలిమినేట్ చేసేవారు. వాళ్లు కచ్చితంగా టార్గెట్ చేసి బయటకు పంపేవారు. అయితే ఓటింగులో మణికంఠ టాప్‌లో ఉండడంతో బిగ్ బాస్ మణికంఠను కాపాడి సేఫ్ జోన్‌లో ఉంచారు. మణికంఠ తర్వాత ఆదిత్య ఓం రెండో ఆప్షన్. ఎందుకంటే.. విష్ణుప్రియ, నైనీకా అంతా హౌస్‌లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఆదిత్య హోమ్‌కి ఏ విధంగానూ మద్దతు లభించదు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అయితే ఆదిత్య ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు. నబీల్ సపోర్టు చేసిన మణికంఠ మాత్రం చేయలేదు. ఆదిత్యను ఒకడుగు ముందుకు తీసుకెళ్లి తన రీజన్స్ చెప్పాడు నిఖిల్. ఇక ఆ తర్వాత నబీల్.. విష్ణుప్రియని, ప్రేరణ-పృథ్వీ.. నైనికను ఎలిమినేట్ అవుతారని తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ తర్వాత సీత, యష్మీ ఇద్దరూ మళ్లీ ఆదిత్య ఎలిమినేట్ కావాలని కోరారు. ఇలా హౌస్‌లో నలగురు ఆదిత్య ఎలిమినేట్ కావాలన్నారు. దీంతో మెజార్టీ ఆదిత్యనే కావడంతో హౌసు నుంచి బయటకు వెళ్లక తప్పలేదు.