NTV Telugu Site icon

PM Modi: కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్

Pm Modi

Pm Modi

PM Modi: దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా పోస్ట్ బాక్స్ ను ఎలా గుర్తు పట్టగలమో… అదే విధంగా పోలీస్ యూనిఫాంను కూడా గుర్తించగలిగేలా ఉండాలన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్ లో శుక్రవారం రాష్ట్రాల హోంమంత్రులు, డీజీపీలతో నిర్వహించిన చింతన్ శిబిరంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లను బహుళ అంతస్తుల్లో నిర్మించాలని సూచించారు. కింద అంతస్తులో పోలీస్ స్టేషన్ ను నిర్వహించాలని… పై అంతస్తుల్లో పోలీసుల నివాస సముదాయాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అప్పుడు పోలీసులు నగరాలకు దూరంగా ఉండటం తగ్గుతుందని తెలిపారు. పాత వాహనాలను పోలీసులు ఉపయోగించకూడదని… ప్రభుత్వ తుక్కు విధానం ప్రాకారం పాత వాహనాల వినియోగానికి దూరంగా ఉండాలని చెప్పారు.

Read Also: Jammu Kashmir: ఆ గ్రామంలో ఉన్న ఒక్క మహిళ వెళ్లిపోయింది.. ఇప్పుడు ఏంటి పరిస్థితి?

దేశంలో ఉన్నా నక్సలిజాన్ని ఓడించాలని ప్రధాని పిలుపునిచ్చారు. నక్సల్స్ గన్నులు పట్టుకోగలరు, పెన్నులు పట్టుకోగలరని… యువతను పక్కదోవ పట్టించగలరని చెప్పారు. యువత భావోద్వేగాలను వాడుకుని దేశ సమైక్యతను దెబ్బ తీసేందుకు యత్నించేవారిని ఓడించేందుకు మన బలగాలు మేధోశక్తిని పెంచుకోవాలని చెప్పారు. చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ నక్సల్స్ అమాయకపు ముఖం పెడతారని చెప్పారు. భద్రతా దళాలు అటువంటి శక్తులను గుర్తించాలన్నారు.

Read Also: Flash Light Eye: ఫ్లాష్ లైట్‎గా మారిన కన్ను.. కళ్లు చెదిరే ఆవిష్కరణ అంటే ఇదే కావొచ్చు

సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేయొద్దని… తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళానికి గురి చేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని అన్నారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే ముందు పది సార్లు చూసుకోవాలని చెప్పారు.