Site icon NTV Telugu

Andhra Pradesh: వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Ys Jagan

Ys Jagan

Andhra Pradesh: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకంగా రూ.750 చెల్లించేందుకు సిద్ధమైంది.. అంటే.. గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5 వేలకు అదనంగా ఈ రూ.750ను చెల్లించనుంది వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో వాలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.. అందుకే వారికి ఈ ప్రోత్సాహ­కాన్ని అందజేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వాలంటీర్లకు అందించనున్నారు..

Read Also: INDIA : ఇండియా కూటమిలో కొలిక్కి రాని సీట్ల లొల్లి.. బహిరంగంగా బయటకు వస్తున్న పార్టీల ‘కోరిక’

ఈ నెలలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో వాలంటీర్లను మరింత భాగస్వాములను చేయడం కోసం ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.. అయితే, ఇప్పటి వరకు రూ.5 వేలు గౌరవ వేతనం పొందుతున్నారు వాలంటీర్లు.. వారికి అదనంగా రూ. రూ.750 ప్రోత్సాహకాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ, ఎప్పటి నుంచో వర్తింపజేస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, వైఎస్ జగన్ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తోన్న విషయం విదితమే.

Exit mobile version