Site icon NTV Telugu

Addanki Dayakar : . ఎవరో చెప్తే నేను మాట్లాడను.. మీరంటే గౌరవం

Addanki Dayakar

Addanki Dayakar

 

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. అయితే.. తమలోతామే విమర్శలు చేసుకుంటుంటే.. అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ పై అద్దంకి దయాకర్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. మీ లాంటి పెద్దలు పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడటం తగదు. నేను మాట్లాడిన మాటలపై పొరపాటు జరిగింది అని చెప్పిన. అంతర్గత అంశాలపై సెట్ చేస్ బాధ్యత మీరే తీసుకోండి. మిమ్మల్ని ఎవరు కాదనరు.

 

టీఆర్‌ఎస్‌..బీజేపీ లు కలిసి కాంగ్రెస్‌ని లక్ష్యంగా కుట్రలు చేస్తుంది. వీటిపై కొట్లాడాల్సిన మనం… అంతర్గత అంశాలపై మాట్లాడుకోవడంపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. టీఆర్‌ఎస్‌.. బీజేపీ కుట్రలతో కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బందుల్లో ఉంది. నేను చేసిన కామెంట్స్ కి నేనే బాధ్యుడిని, రేవంత్ రెడ్డి అనిపించారు అనేది అవాస్తవం. ఎవరో చెప్తే నేను మాట్లాడను. అన్ని అంశాలు ఏఐసీసీ పరిశీలిస్తుంది. మీరంటే గౌరవం. పార్టీ నీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టెలా చేయకండి అని కోరుతున్నాను అని అద్దంకి దయాకర్‌ వీడియో విడుదల చేశారు.

 

Exit mobile version