మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సన్నాసులు పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు పండబెట్టి తొక్కుతారన్నారు. 4 కోట్ల మంది చెప్పుతో కొట్టినా బుద్దిరాలేదని, చెప్పులతోని కొట్టిన గాని బీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. రెండు నెలలకే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది మీకు అని, ఫ్రస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. తన్ని తరిమేసే దాకా చూసుకునేలా ఉన్నారని, ఇలాంటి చిల్లరగాల్లా.. తెలంగాణను పాలించిందన్నారు. ఈ చిల్లరగాళ్ల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని, కేటీఆర్ అండ్ టీం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. రెచ్చగొట్టే మాటల ద్వారా అబాసుపాలు చేయాలని చెప్పి చూస్తున్నారని, మీ అవినీతిని మొత్తం బయటికి తీస్తామన్నారు. విద్వేషం విషం చిమ్మే పనులు చేస్తున్నారని… అవి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు.
Komatireddy Venkat Reddy : KRMBపై చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమా.. అసెంబ్లీలో అన్ని చేర్చిస్తాం..
అనంతరం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ‘దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలలోని ప్రభుత్వాలని కూలదోసి అనైతికంగా గద్దెనెక్కాలని చూస్తున్నారు. దేశంలో ప్రజా స్వామ్యం గెలుస్తుందని మరొక సారి జార్ఖండ్ లో ప్రూవ్ అయింది. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోని అన్ని వర్గాలకు రక్షణ ఉంటది. అందుకే జార్ఖండ్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో రక్షణ కల్పించినం. రేపు 12వ తేదీన బీహార్ లో మరొక సారి ప్రజా స్వామ్యం గెలవబోతుంది. బీహార్ ఎమ్మెల్యేలకు కూడా ఈ నెల11 వరకు హైదరాబాద్ లో రక్షణ కల్పిస్తున్నాం. కేటీఆర్ కొద్ది రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలి పోతుందని అప్రజాస్వామిక మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఈ రెండు రాష్ట్రాలు గొడ్డలి పెట్టు. రేవంత్ రెడ్డి పై కేటీఆర్, హరీష్ రావులు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు, బాల్క సుమన్ స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నాడు. సంస్కారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు.’ అని ఆయన అన్నారు.
Supreme Court: మేయర్ ఎన్నిక నిర్వహించేది ఇలానేనా? చండీగఢ్ ఆఫీసర్‌కి కోర్టు చీవాట్లు