Site icon NTV Telugu

Adah Sharma: అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది ఆదా నీకు..

Aadasarma

Aadasarma

ఆదా శర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన పెద్దగా ఫెమస్ అవ్వలేక పోయింది.. దాంతో సెకండ్ హీరోయిన్ గా మంచి టాక్ ను అందుకుంది.. ఇటీవల ది కేరళ స్టోరీ అనే సినిమాలో నటించింది.. ఆ సినిమా వివాదాలను అందుకుంది.. అంతేకాదు మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇక సోషల్ మీడియా లో మాత్రం ఓ రేంజులో ఆకట్టుకుంటుంది.. తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ప్రస్తుతం ‘బస్తర్‌.. ది నక్సల్స్‌ స్టోరీ’ అనే మరో కాంట్రవర్సీ మూవీలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్‌ కానుంది. అయితే ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటుంది అదా శర్మ. తన గ్లామర్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోస్‌ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. అలాగే వంట వీడియోలు, వింత డ్రెస్సులు, వ్యాయమాాలు, తాడుతో వెరైటీగా చేసే విన్యాసాలు, కర్రసాము వీడియోలను కూడా ఫ్యాన్సతో పంచుకుంటుంది.. ఇప్పుడు షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో మరాఠీ భాషలో మాట్లాడింది అదాశర్మ. ‘దోమలు చూడు ఎంతలా కుట్టాయో.. నా రక్తం అంతా తాగేశాయ్‌’ అంటూ తన శరరీంపైనున్న దోమ కాట్లను చూపించింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. దోమ కాట్లను చూపిస్తున్నావా? లేదా చేతులను చూపిస్తున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..

Exit mobile version