Urfi Javed : ఉర్ఫీ జావేద్ తన వస్త్రాలంకరణ కారణంగా ఎప్పుడూ నెటిజన్ల టార్గెట్‌లో ఉంటోంది. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ కొత్త హాట్ లుక్ తో మరో సారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఉర్ఫీ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా ఉర్ఫీ ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ పోస్టులో వెదురు బుట్ట నుంచి తయారు చేసిన వస్త్రాలను ధరించినట్లు తెలుస్తోంది. ఫ్యాషన్ డిజైనర్లు తన కోసం ప్రత్యేకంగా వెదురు తాడులను ఉపయోగించి అందమైన డ్రెస్ తయారు చేశారు. ఉర్ఫీ జావేద్ కొత్త స్టైల్ చూసి అందరూ షాక్ అయ్యారు.
Read Also: Ileana Ban: అసలే అవకాశాలు లేవు.. ఇంకా ఎందుకురా పాపను ఏడిపిస్తారు
ఇప్పుడు ఉర్ఫీ జావేద్ లుక్ చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఒక వినియోగదారు ఈ ఉర్ఫీ ఏది చేసినా, అది ఎప్పుడు చేస్తుందో చెప్పడం కొంచెం కష్టమన్నాడు. మరొకరు సిగ్గుపడండి అని రాశారు. వెదురు తాడులను ఉపయోగించి అందమైన కుండలు, కుర్చీలు, బల్లలు ఎలా తయారు చేస్తారని తెలుసు కానీ.. నేను ఇది చూసి ఆశ్చర్యపోతున్నాను అని కామెంట్ చేశాడు. ఉర్ఫీ జావేద్ తన దుస్తుల విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ OTT నుండి ఉర్ఫీ జావేద్‌కు గుర్తింపు వచ్చింది. బట్టల కారణంగా ఉర్ఫీ జావేద్‌కు తరచూ హత్య బెదిరింపులు వస్తున్నాయి.