ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్‌లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ అంశంపై నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
READ MORE: Union Budget 2025: కేన్సర్ పేషెంట్లకు శుభవార్త.. 3 ఏళ్లలో ప్రతి జిల్లాల్లో డేకేర్ కేన్సర్ సెంటర్లు
“ద్వేషం, విషంతో నిండిన కొంతమంది కారణంగా ఓ అమాయకపు బాలుడు జీవితాన్ని కోల్పోయాడు. ర్యాగింగ్ ఎంత డేంజరో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. కానీ.. వాళ్లు పడుతున్న ఇబ్బందులు బయటకు చెప్పాలంటే భయపడుతున్నారు. చెప్పిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందో అని లోలోపల బాధపడుతున్నారు. ఇంతకీ మనం ఎక్కడ విఫలం అవుతున్నాం. ఈ తాజాగా అంశంపై సంతాపం తెలపడం కాదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ను లేవనెత్తాలి. సంబంధిత అధికారులు ఈ ఘటనను క్షుణ్ణంగా పరిశీలించాలి. నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నాను. బాధిత విద్యా్ర్థికి న్యాయం జరగాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా, వేధింపులకు గురి చేసినా, అవమాన పరిచినా వెంటనే బహిరంగంగా చెప్పాలి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవండి” అని నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
READ MORE: Union Budget 2025: కేన్సర్ పేషెంట్లకు శుభవార్త.. 3 ఏళ్లలో ప్రతి జిల్లాల్లో డేకేర్ కేన్సర్ సెంటర్లు