NTV Telugu Site icon

Pranitha Subhash: రెండోసారి తల్లైన హీరోయిన్ ప్రణీత.. పిక్ వైరల్!

Pranitha Subhash Baby Boy

Pranitha Subhash Baby Boy

Actress Pranitha Subhash Birth Second Child: హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండోసారి తల్లయ్యారు. బుధవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రణీత తన భర్త, బిడ్డతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్, నెటిజన్స్ ఈ కన్నడ బ్యూటీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. నటి ప్రణీతకు మొదటి సంతానంగా కూతురు ఉన్న విషయం తెలిసిందే. కొడుకు పుట్టినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని, కూతురు అర్నా ఆనందంతో డ్యాన్స్ చేసిందని ప్రణీత పేర్కొన్నారు.

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో ప్రణీత సుభాష్ టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. బావ, అత్తారింటికి దారేది, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం.. సినిమాలు చేశారు. పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్‌, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన ప్రణీత.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో చివరగా ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంలో నటించారు. ఇటీవలి కాలంలో కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. 2010లో పోర్కీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణీత.. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు.

Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్‌ రేట్స్ ఇవే!

2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, తన స్నేహితుడు నితిన్‌ రాజుని ప్రణీత సుభాష్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022 జూన్‌లో కూతురు అర్నా జన్మించింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లో నటించారు. తెలుగు ఢీ డ్యాన్స్ షోలో కొన్ని ఎపిసోడ్‌లకి జడ్జీగా కూడా వ్యవహరించారు. రెండేళ్ల తర్వాత ప్రణీత మరోసారి తల్లి అయ్యారు. ప్రస్తుతం ఈ బాపుబొమ్మ బెంగళూరులో ఉంటున్నారు.

Show comments