NTV Telugu Site icon

Katrina Kaif: రూమర్లకు చెక్.. కత్రినా కైఫ్ ఫొటోస్ వైరల్!

Katrina Kaif Pregnant

Katrina Kaif Pregnant

Katrina Kaif Pregnancy Rumours: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఇటీవలి రోజుల్లో ఎన్నో రూమర్లు చెక్కర్లు కొట్టాయి. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఓ వీడియో ఆధారంగా కాట్ గర్భవతి అయిందని న్యూస్ వచ్చాయి. లండన్‌కు చెందిన కత్రినా.. అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు. ఈ రూమర్లకు కాట్ చెక్ పెట్టారు. ఫ్లాట్ పొట్టతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.

గత నెలలో కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి లండన్‌కు విహార యాత్రకు వెళ్లారు. విక్కీ తన 36వ పుట్టినరోజును మే 16న లండన్‌లో జరుపుకున్నాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. లండన్‌ పర్యటన ముగుంచుకున్న.. విక్కీ-కత్రినా జోడి శనివారం రాత్రి ముంబైకి చేరుకుంది. ఎయిర్ పోర్టులో కాట్ బ్లాక్ సూట్‌లో ఫొటోలకు పోజులిచ్చిచ్చారు. ఆమె గర్భం దాల్చలేదనే విషయం ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమౌతుంది. తాజా ఫొటోలతో కత్రినా అన్ని రూమర్లకు చెక్ పెట్టారు.

Also Read: IND vs PAK: టీమిండియాదే బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!

2021లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కత్రినా తన కెరీర్‌పై దృష్టి పెట్టారు. గతేడాది టైగర్-3లో నటించిన కాట్.. ఈ ఏడాది మెర్రీ క్రిస్మస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. మరో సినిమాను ఆమె ప్రకటించలేదు. మరోవైపు ఛావా, బ్యాడ్ న్యూజ్, లవ్ అండ్ వార్ వంటి ప్రాజెక్ట్‌లలో విక్కీ కౌశల్ బిజీగా ఉన్నాడు.

Show comments