NTV Telugu Site icon

Actress Kasturi: జైలుకు తమిళ నటి కస్తూరి.. ఈ నెల 29 వరకు రిమాండ్

Actress Kasturi

Actress Kasturi

Actress Kasturi: తమిళ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు. నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్‌లో కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది.

బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అవమానితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో నవంబర్‌ 4న చెన్నైలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో నటి కస్తూరి అంతఃపురంలో సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువాళ్లని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంలో తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి ఆ మాటలు వెనక్కి తీసుకున్నానన్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడేవారు అంతఃపురంలో రాజ మహిళలకు సేవ చేసేందుకు వచ్చారంటూ కామెంట్ చేయడంతో పలువురి నుంచి వ్యతిరేకత వచ్చింది.

Read Also: Bandi Sanjay: రెండు రోజులు కనపడకుంటే ఇంత రాద్ధాంతం చేయాలా..

కస్తూరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కస్తూరి “తమిళుల మధ్య విభజన ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడే ద్రావిడ డయాస్పోరా మోసగాళ్ల ద్వంద్వ ప్రమాణాన్ని నిన్న నేను బయటపెట్టాను. డీఎంకే నాపై తెలుగు వ్యతిరేకులని దుష్ప్రచారం చేస్తూ నాపై దుష్ప్రచారం చేస్తోంది. నేను తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ ఫేక్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు. బ్రాహ్మణ కమ్యూనిటీని వంటేరి అని పిలిచే వారు తమిళులేనా అని ప్రశ్నించాను. బ్రాహ్మణులపై ఇంత విద్వేషం ఎందుకు..వ్యక్తిగత దాడులను ఎదుర్కోలేక పోతున్నాను” అని ఆమె పేర్కొంది. కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగుసంఘాలతో పాటు తెలంగాణ బీజీపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. క్షమాపణలకు డిమాండ్‌ చేసింది. కస్తూరి క్షమాపణలు చెప్పినా తెలుగుసంఘాలు వెనక్కి తగ్గ లేదు. తమిళనాడువ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు తెలుగు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.