NTV Telugu Site icon

Karisma Kapoor: స్నేహితులతో గడపాలని టార్చర్ చేశాడు.. భర్తపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

Karisma Kapoor

Karisma Kapoor

Actress Karisma Kapoor Reveals shocking things that happened in life: బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కపూర్’ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎందరో స్టార్ హీరోయిన్స్, హీరో హోదాలో ఉన్నారు. అందులో ఒకరే ‘కరిష్మా కపూర్’. కపూర్ ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా.. కరిష్మా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రేమ్ ఖైదీ, జిగర్, అనారీ, అందాజ్ అప్నా అప్నా, రాజా బాబు.. వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు సరైన జోడిగా కరిష్మా నిలిచారు.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పడే బడా బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్‌ని కరిష్మా కపూర్‌ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో.. 2003లో పెళ్లి చేసుకున్న వీరు 2016లో విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కరిష్మా.. ఇటీవల ‘మర్డర్ ముబారక్’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మా.. తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. పెళ్లైన మొదటి రాత్రే తన భర్త చిత్రహింసలకు గురి చేశాడని, స్నేహితులతో గడపాలంటూ టార్చర్ చేశాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Team India-PM Modi: ప్రధాని మోడీతో భారత క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్!

‘పెళ్లైన తొలిరాత్రే సంజయ్ కపూర్ నన్ను చిత్రహింసలకు గురిచేశాడు. పెళ్లి తర్వాత హనీమూన్‏కు వెళ్లిన సమయంలో అతడి స్నేహితులతో రాత్రి గడపాలని ఒత్తిడి చేశాడు. డబ్బు కోసం నన్ను వేలం వేయడానికి కూడా సిద్ధమయ్యాడు. సంజయ్ తన తల్లితో కూడా కొట్టించాలని చూశాడు’ అని కరిష్మా కపూర్‌ తెలిపారు. ప్రస్తుతం కరిష్మా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విడాకుల సమయంలో కరిష్మాకు సంజయ్ విలాసవంతమైన ఇంటితో పాటు రూ.14 కోట్లు భరణంగా ఇచ్చాడని అప్పట్లో టాక్ నడిచింది.

Show comments