NTV Telugu Site icon

Karate Kalyani : నన్ను సస్పెండ్ చేసి మంచి గిఫ్ట్ ఇచ్చారు : కరాటే కళ్యాణి

Karate Kalyani

Karate Kalyani

Karate Kalyani : నిత్యం ఏదో ఒక వివాదం వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తారు కరాటే కళ్యాణి. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బ్యాండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా నటి కరాటే కళ్యాణి అభ్యంతరం చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు రూపంలో రూపొందించిన నేపథ్యంలో ఆవిష్కరణ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ తెరవేల్పు మాత్రమే ఇలవేల్పు కాదని ప్రతిఘటించారు. దీనిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా స్టే ఆర్డర్ వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఈ విషయంలో కరాటే కళ్యాణిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. ఆమె సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేసింది.

Read Also:Kishan Reddy: సచివాలయం ఓపెనింగ్ కు గవర్నర్ ను ఎందుకు పిలవలేదు?

‘మా’ అసోసియేషన్ నిర్ణయంపై కరాటే కళ్యాణి స్పందించారు. తనను సస్పెండ్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అంటే నాకు గౌరవం. నేను ఆయన అభిమానినే. ఆయన్ని నేను ఎక్కడా తక్కువ చేసి మాట్లాలేదు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు. శ్రీకృష్ణుడు రూపంలో విగ్రహం ఉండకూదన్నాను. చిరంజీవి శివుడు, సుమన్ వెంకటేశ్వర స్వామి, నాగార్జున అన్నమయ్య, ప్రభాస్ రాముడు పాత్రలు చేశారు. రేపు వాళ్ళ అభిమానులు కూడా అదే అవతారాల్లో విగ్రహాలు పెడతామంటారు. మా నుండి సస్పెండ్ చేయడం చాలా బాధగా ఉంది. నేను పరిశ్రమ తరపున అనేకమార్లు మాట్లాడాను. విమర్శలు ఎదుర్కొన్నాను. అందుకు నాకు సరైన బహుమతి ఇచ్చారు. వివరణ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఎవరి ఒత్తిడితోనైనా ఈ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు… అని కరాటే కళ్యాణి ఆవేదన చెందారు.

Read Also:Long Covid Effect: లాంగ్‌ కోవిడ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలు