NTV Telugu Site icon

Kangana Ranaut: ఈ రాజకీయం కంటే ఆ పని చేయటమే నయం.. నటి సంచలనం

Maxresdefault (19)

Maxresdefault (19)

Kangana Ranaut Comments On Political Life: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యకేంగా చెప్పాలిసిన పని లేదు. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకపక్కరాజకీయాల్లో అడుగు పెట్టింది. బీజేపీ అభ్యర్థిగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 74 వేలకు పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలిచినా అనంతరం ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్‌ చేసి పూర్తిగా ప్రజాసేవలోనే లీనమవుతానని వెల్లడించింది. కానీ ఇటీవల చండీగర్హ్ విమానాశ్రమంలో ఎదురైనా సంఘటన తరువాత ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. ‘‘ఓసారి నా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ జీవిత సూక్తులను బోధించారు. ‘తెలివైనవారు తమకు నచ్చిన పనిని మాత్రమే చేస్తారు. కానీ, అవసరమైన పనిని చేసినవారే మేధావులు అవుతారు’ అని అన్నారు. అందుకే గురూజీ చూపిన మార్గాన్ని ఎంచుకున్నా. రాజకీయాలపై ఆసక్తి లేకుంటే.. ఇన్ని కష్టాలను భరించాల్సిన అవసరం ఉండకపోయేది’’ అని

Also Read; Sudheer Babu Tag: సుధీర్ బాబుకి కొత్త టాగ్‌.. ఏంటో తెలుసా?

‘రాజకీయాల నుంచి పిలుపు రావడం నాకు కొత్తేమీ కాదు.అని నా ఫస్ట్‌ సినిమా గ్యాంగ్‌స్టర్‌ రిలీజైన వెంటనే టికెట్‌ ఆఫర్‌ చేశారు. ఆ తర్వాత కూడా పలుసార్లు పాలిటిక్స్‌లోకి రావాలంటూ ఆహ్వానాలు అందాయి. మా తాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ సక్సెస్‌ ఉంది కనుకనే మమ్మల్ని పదేపదే పాలిటిక్స్‌లోకి రమ్మని ఆహ్వానించేవారు. నాతో పాటు మా నాన్నకు, చెల్లికి కూడా పిలిచేవారు కానీ సరైన టైం కోసం ఎదురు చూసాను అని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాలు గురించి ప్రత్యేక వ్యాఖ్యలు చేసారు, నిజానికి రాజకీయాలతో పోలిస్తే.. నటులు అంతగా కష్టాలు లేని జీవితాన్ని గడుపుతారు. సెట్స్‌కి వెళ్లి రిలాక్స్‌ అవుతూ.. ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతాం. కానీ, ఎంతోమంది రకరకాల సమస్యలతో నాయకుల ముందుకువస్తుంటారు. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది’’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు.