Actress Hema: నటి హేమా గురించి తెలియని వాళ్లుండరు. టాలీవుడ్‌లో అనే పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. కొంత కాలం కిందట బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు బయటకు వచ్చింది. టాలీవుడ్ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటో రిలీజ్ చేశారు. హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కానీ.. చివరికి నటి హేమకు డ్రగ్స్ కేసులో బెంగళూరు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హేమ లేటెస్ట్గా సోషల్ మీడియాలో హేమకు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది.
READ MORE: Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
తాజాగా డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపేందుకు ఈగల్ టీమ్ కీలక స్టెప్ వేసింది. నగరంలోని ప్రముఖ పబ్‌లలో రైడ్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొండాపూర్ లోని “క్వాక్ ఏరీనా పబ్” పై ఈగల్ టీమ్ తో పాటు స్థానిక పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించారు. ఇక్కడ క్వాక్ ఏరీనా పబ్ “బ్లాక్ కాఫీ” పేరుతో ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు నటి హేమ సైతం హాజరైంది. ఇక ఈగల్ టీమ్ ఈ పార్టీలో పాల్గొన్న వారిలో నలభై మందికి పైగా డ్రగ్స్ పరీక్షలు చేపట్టింది. అయితే ఈ టెస్ట్‌ల్లో ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఆరుగురు గంజాయి, మితవాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇదిలా ఉండగా.. తన యూరిన్ టెస్ట్ రిపోర్టును హేమ బయటపెట్టింది. తనకు జరిపిన యూరిన్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. ఈ టెస్ట్‌కు సంబంధించిన రిజల్ట్స్ సైతం చూయించింది. ఇవాళ్ల నేను క్వాక్ ఏరీనా పబ్‌కు వచ్చాను. ఇక్కడ నా యూరిన్ శాంపిల్ తీశారు. నాకు నెగిటివ్ వచ్చింది. మీ హేమ ఎప్పుడూ తప్పు చేయదు. జన్యూన్‌గా, ముక్కుసూటిగా ఉంటుంది.” అని వీడియో పేర్కొంది.
READ MORE: INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు
