Genelia : ప్రముఖ నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ క్యూటీ బొమ్మరిల్లు సినిమాలో హా..హా.. హాసిని పాత్రతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే జెనీలియా బ్రేకప్ వార్త బయటకు వచ్చింది. బొమ్మరిల్లు సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించి తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. జెనీలియా 2002లో రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
Read Also:Manu Bhaker: మొదటిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మను భాకర్
తాను ప్రేమలో ఉన్నప్పుడే అర్ధరాత్రి రితేష్ చేసిన మెసేజ్ చూసి కంగారు పడ్డానని జెనీలియా వ్యాఖ్యానించింది. అర్ధరాత్రి 2.30 గంటలకు రితేష్ పంపిన మెసేజ్ చదివి ఏం జరిగిందో అర్థంకాక భావోద్వేగానికి గురయ్యానని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. ‘‘మేం డేటింగ్‌లో ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది.. దాన్ని ఇప్పటికీ మర్చిపోలేను.. రితీష్‌కి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.. నేను త్వరగా నిద్రపోతాను.. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ అర్ధరాత్రి తర్వాత రితేష్ నాకు మెసేజ్ పంపాడు.
Read Also:Nanebiyam Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?
బ్రేకప్ చెప్పుకుందాం అంటూ మెసేజ్ పంపాడు. ఉదయం ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యాను. చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు రితీష్ నిద్ర లేవడం కోసం ఎదురుచూశాను.. మొదటి రోజు ఉదయం రితీష్ నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగాడు. నాకు కోపం వచ్చింది. మనం ఇక మాట్లాడకపోవడమే మంచిదని అనుకుంటున్నా నువ్వేం అనుకుంటున్నావ్ అన్నాను. దీంతో రితీష్ ఏం జరగనట్లు అలా ఎలా మాట్లాడుతున్నావ్ అంటూ అరిచాడు. ఆ తర్వాత రాత్రి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, తాను కేవలం జోక్‌గా పంపానని, ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ కావడంతో అలా చేశానని రితేష్ వివరించాడు. ఆ తర్వాత అంతా బాగానే ఉందని జెనీలియా తెలిపింది. రితీష్‌ని పెళ్లి చేసుకోవడం తన కెరీర్‌లో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటి అని జెనీలియా పేర్కొంది. మొత్తానికి ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.