Site icon NTV Telugu

Jiah Khan Suicide Case: నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించిన ముంబై కోర్టు

Jiah Khan Suicide Case

Jiah Khan Suicide Case

Jiah Khan Suicide Case: నటి జియాఖాన్‌ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. సూరజ్‌ వల్లే జియాఖాన్‌ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ తీర్పు చెప్పారు. జియా ఖాన్(25) జూన్ 3, 2013న ముంబైలోని తన జుహూ ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. జియా రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ ఐపీసీ సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. దీంతో​ పదేళ్ల కిందటి నాటి ఈ కేసులో జియాఖాన్‌కు న్యాయం జరుగుతుందని భావించిన వాళ్లంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును జియాఖాన్‌ తల్లి రబియా సవాల్‌ చేసే అవకాశం ఉంది.

Read Also: Viral poster: సెలవు తీసుకున్న డ్రైవర్‌.. పోస్టర్లు వేసిన యజమాని

న్యూయార్క్‌లో పుట్టి పెరిగి.. ఇంగ్లీష్‌-అమెరికన్‌ నటిగా నఫిసా రిజ్వి ఖాన్‌ అలియాస్‌ జియాఖాన్‌ పేరు సంపాదించుకుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ‘నిశబ్ద్‌’తో బాలీవుడ్‌లో లాంచ్‌ అయిన జియా.. చేసింది మూడు చిత్రాలే అయినా సెన్సేషన్‌గా మారింది. నిశబ్ద్‌తో పాటు అమీర్‌ ఖాన్‌ గజిని, హౌజ్‌ఫుల్‌ లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో జియాఖాన్‌ నటించింది 2013, జూన్‌ 3న ముంబై జూహూలోని తన ఇంట్లో జియాఖాన్‌(25) విగతజీవిగా కనిపించింది. ఘటనా స్థలంలో దొరికిన ఆరు పేజీల లేఖ ఆధారంగా.. జూన్‌ 10వ తేదీన ముంబై పోలీసులు నటుడు సూరజ్‌ పంచోలిని ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంతో(ఐపీసీ సెక్షన్‌ 306 ప్రకారం) ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఆదిత్యా పంచోలీ తనయుడైన సూరజ్‌ పంచోలీ, జియాతో డేటింగ్‌ చేశాడనే ప్రచారం ఉంది. 2012 సెప్టెంబర్‌ నుంచి వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. జియా ఖాన్ తల్లి రిబియాఖాన్ తన కూతురిది హత్యేనని వాదిస్తోంది. జియాను శారీరకంగా, మానసికంగా సూరజ్‌ హింసించాడని, ఫలితంగా నరకం అనుభవించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. 2013 అక్టోబర్‌లో రబియా, జియాఖాన్‌ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

Exit mobile version