Site icon NTV Telugu

Shivaji Apologies: “ఆ మాటలు నన్ను వెంటాడాయి… 36 గంటలు నిద్ర పట్టలేదు”.. ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పిన శివాజీ..!

Shivaji

Shivaji

Shivaji Apologies: దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంగా క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. స్టేజ్‌పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీక‌రించారు.

న‌టుడు శివాజీ మాట్లాడుతూ.. ‘‘నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి న‌టీన‌టుల‌కు, ఆడ‌బిడ్డ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. ఆ రెండు ప‌దాల‌ను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా ప‌దాల‌ను ఎప్పుడూ దొర్ల‌లేదు. నేను ఇక్క‌డ‌కు వ‌చ్చి 30 సంత్స‌రాల‌వుతుంది. అన్నేళ్లు పాలిటిక్స్‌లో ఉన్న‌ప్ప‌టికీ ఏరోజు కూడా ఏ మ‌హిళ‌నైనా, పార్టీనైనా హ‌ద్దు దాటి మాట్లాడ‌లేదు. అలాంటిది భ‌గ‌వంతుడు ఎందుకో అలా చేశాడు. ప‌దాలు అలా దొర్లిపోయాయి. ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డాను. కార్య‌క్ర‌మం నుంచి బ‌య‌ట‌కు రాగానే గెస్ట్‌తో అన్నాను. అబ్బాయ్‌.. దొర్లేశాన‌ని అన్నాను. ఆ రెండు ప‌దాల‌కు మీ అంద‌రికీ సిన్సియ‌ర్‌గా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు క‌ట్టుబ‌డే ఉన్నాను. దాంట్లో ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదు. ఆ రెండు పదాలు మాత్రం అన్‌పార్ల‌మెంట‌రీ వర్డ్స్‌. కాబ‌ట్టి నా గుండె సాక్షిగా చెబుతున్నాను. చాలా బాధ‌ప‌డుతున్నాను. అలా మాట్లాడ‌టం త‌ప్పు.

Sakibul Gani New Record: నగలు అమ్మి బ్యాట్‌ కొనిచ్చిన తల్లి.. 32 బంతుల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన తనయుడు..

నేను 36 గంట‌లైంది స‌రిగ్గా నిద్ర‌పోయి.. నాపై న‌మ్మ‌కంతో నిర్మాత నాకు అవ‌కాశం ఇస్తే.. ఇలా ఎందుకు జ‌రిగింద‌ని నాలోనే అంత‌ర్మ‌థ‌నానికి లోన‌య్యాను. అందుక‌నే రాలేక‌పోయాను. దండోరా సినిమా రేపు (డిసెంబ‌ర్ 25) రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి సినిమా ప్ర‌మోష‌న్‌కు వ‌స్తాన‌ని ప్రొడ్యూస‌ర్‌కి చెప్పాను. రేపు విడుద‌ల‌వుతున్న దండోరా సినిమాను మీకు ద‌గ్గ‌ర‌గా ఉన్న థియేట‌ర్స్‌లో చూడండి. స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తోన్న కుల వ్య‌వ‌స్థ మీద‌.. ప్రేమ ప‌ట్ల వ్య‌తిరేక‌త త‌ర‌త‌రాలుగా న‌డుస్తోంది.. భ‌విష్య‌త్తులోనూ న‌డుస్తుంది. వాటిని గ‌ట్టిగా స్పృశిస్తూ.. అలాగే అస‌మాన‌త‌ల‌పై తీసిన సినిమా. అయినా మ‌నుషులు మార‌రు. ఎన్నోసార్లు చెప్పే ఉంటారు. అయినా మ‌నుషులు మార‌రు. మార‌తార‌నే ఆశ‌తో ప‌ని చేసుకుంటూ వ‌చ్చే త‌రాల‌కు మంచిని అందించాలనే ఉద్దేశంతో, మంచి క‌థ‌తో చేసిన సినిమా.

క‌థ‌, నిజ‌మైన కొన్ని ఘ‌ట‌న‌ల‌తో సినిమా చేశారు. ఈ సినిమాకు ప‌ని చేసిన ఆర్ట్ డైరెక్ట‌ర్స్ అయితే ఆ నెటివిటీని, 1998-2000 కాలాన్ని కొన్ని ఘ‌ట‌ల‌ను బేస్ చేసుకుని మంచి ప్రేమ క‌థ‌ను, కుల వ్య‌వ‌స్థ‌ను స్పృశిస్తూ చేసిన సినిమా దండోరా. మంచి సినిమాను అందించిన ద‌ర్శ‌కుడు, నిర్మాత‌కు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక నేను వ్య‌క్తిగ‌తంగా కొన్ని విష‌యాలు మాట్లాడాల‌నుకుంటున్నాను. నా క‌న్నా ముందు చాలా మంది గొప్ప జ‌ర్న‌లిస్టులు తెలుగు జాతి మొత్తం వాళ్ల మాట‌ల్ని వింటూ.. సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల‌నే ఆరాటంతో ప‌ని చేస్తోన్న చాగంటి కోటేశ్వ‌ర‌రావు, అలాగే గ‌రిక‌పాటిగారి ప్ర‌వ‌చ‌నాల్లో స్త్రి ప‌ట్ల‌, స్త్రీకున్న ప్రాముఖ్య‌త ప‌ట్ల వాళ్లు మాట్లాడిన సంద‌ర్భాలున్నాయి.

Karnataka vs Jharkhand: టార్గెట్ 413.. అయితే ఏం..! థ్రిల్లింగ్ విజయం అందుకున్న కర్ణాటక..

సినిమా ఇండ‌స్ట్రీలో అలాంటివి చేయొద్దు మీరు. సినిమాల్లో ఎలాగైనా చేసుకోవ‌చ్చు. కానీ బ‌య‌ట‌ అలాంటివి చేయ‌టం వ‌ల్ల‌, ఉండ‌టం వ‌ల్ల‌, క‌ట్టు బొట్టు వ‌ల్ల బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మీరు ఇబ్బందుల‌కు గుర‌వుతార‌ని ఎంతో మంది ప‌దే ప‌దే పెద్ద‌వాళ్లు, సంస్కృతి సంప్ర‌దాయాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న‌వాళ్లు జ‌న‌రేష‌న్స్‌కు చెబుతూ వ‌చ్చారు. నేను అలా మాట్లాడ‌టానికి కార‌ణం.. ఇటీవ‌ల లులూ మాల్‌లో నిధి అగ‌ర్వాల్ ప‌డ్డ వేద‌న‌. త‌ను కారులోకి వ‌చ్చిన త‌ర్వాత ఎంత ఇబ్బందిక‌రంగా ఫీల్ అయ్యిందో నా మైండ్‌లో నుంచి పోలేదు. ఆ త‌ర్వాత స‌మంత‌ కూడా అలాంటి ఇబ్బందే ప‌డ్డారు. నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత 90 శాతం మంది ఫిమేల్ ఆర్టిస్టులు జ‌య‌సుధ‌, విజ‌య‌శాంతి, ర‌మ్య‌కృష్ణ‌.. క‌ట్టుకున్న మోడ‌ల్ చీర‌ల‌ని చెప్పి షాప్స్‌లో అమ్మేవారు.

నేను ఈ డ్రెస్సులు వేసుకోండి.. ఆ డ్రెస్సులు వేసుకోండి.. మీరు కప్పేసుకోండ‌ని ఎవ‌రికీ చెప్ప‌లేదు. నేను ఎవ‌ర్నీ చెప్ప‌టానికి. స‌మాజంలో ఏ రుగ్మ‌త వ‌చ్చినా కానీ.. స‌మాజం సినిమా వ‌ల్ల చెడిపోతుంద‌ని, మీరు వేసుకునే డ్రెస్సుల వ‌ల్ల చెడిపోతుందని అంటున్నారు. సినిమా వ‌ల్ల‌నే ప్రపంచం నాశ‌నం అవుతుంద‌నే మాట‌లు వింటున్నాం. ఇక్క‌డే బ్ర‌తికి, ఇక్క‌డ వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే నా పిల్ల‌ల‌ను చ‌దివించుకుంటున్నా. సినిమాను ఎవ‌రూ ఏమీ అనకూడ‌ద‌నే ఆలోచ‌న‌తో మాట్లాడానంతే. అస‌లు ఆ రెండు ప‌దాల‌ను నా నోటి నుంచి ఎందుకొచ్చాయ‌నేది ఇప్ప‌ట‌కీ న‌మ్మ‌బుద్ధి కావ‌టం లేదు.

ఈ విష‌యంలో నా భార్య‌కు నేను ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పాను. అస‌లు ఏ స్టేట‌స్‌లో ఈ మాట‌లు మాట్లాడావ‌ని అంది. రేపు నా పిల్ల‌లు వాళ్ల ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర ఇబ్బంది ప‌డ‌కూడ‌దు. రాత్రి పన్నెండు త‌ర్వాత ట్వీట్స్ చిన్మ‌యిగారికి, అన‌సూయ‌గారికి ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి, మ‌హిళా క‌మీష‌న్‌కు లేఖ‌లు పంపేశారు. న‌న్ను ఒక్క మాట కూడ అడ‌గ‌లేదు. సుప్రియ‌గారు మాత్ర‌మే మాట్లాడారు. నేను ఆమెకు సారీ చెప్పాను. త‌ప్పుగా మాట దొర్లింద‌ని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు.

Exit mobile version