Site icon NTV Telugu

Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

Sharvanandh

Sharvanandh

టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ఇటీవల తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘బైకర్’ సినిమా భారీ విజయం సాధించిన జోష్‌లో ఉన్నప్పటికీ, ఆయన మాటల్లో మాత్రం ఒక రకమైన ఆవేదన, ప్రతీకార వాంఛ కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కారణం.. గత ఆరు నెలలుగా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు లేదా సక్సెస్ మీట్లలో “నన్ను తొక్కేయలేరు”, “డబ్బులు లేక ఏడ్చాను”, “ఇంకోసారి మోసపోను” అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అత్యంత ధనిక కుటుంబం నుండి వచ్చి, ఇండస్ట్రీలో పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న శర్వానంద్.. షర్ట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని అనడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీకికి తోడు..

Also Read : Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

శర్వానంద్ శారీరక మార్పులు కూడా ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మునుపటికంటే ఆయన విపరీతంగా బరువు తగ్గడంతో పాటు, ఆయన మాట తీరులో కూడా మార్పు కనిపిస్తోంది. గతంలో స్పష్టంగా మాట్లాడే శర్వా, ఇప్పుడు కొంచెం తడబడుతూ లేదా స్వరం తగ్గించి మాట్లాడుతుండటం గమనించవచ్చు. ఇది ఆయన ఆరోగ్య సమస్య వల్ల వచ్చిందా లేక కెరీర్‌లో ఎదురైన తీవ్రమైన ఒత్తిడి వల్ల జరిగిందా అనేది మిస్టరీగా మారింది. ముఖ్యంగా ‘అపద్బాంధవుడు’ క్లైమాక్స్‌లో చిరంజీవి గారి పాత్రలా శర్వానంద్ మాటలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తనను ఎవరో కావాలనే టార్గెట్ చేస్తున్నారనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ మార్పు వెనుక ఉన్న అసలు నిజం శర్వానే స్వయంగా బయటపెట్టాల్సి ఉంది.

Exit mobile version