NTV Telugu Site icon

Sayaji Shinde Health: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజి షిండే!

Sayaji Shinde

Sayaji Shinde

Actor Sayaji Shinde Helth Updates: టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం (ఏప్రిల్ 11) ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. సాయాజీ షిండే గుండెలో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్ర సతారాలోని ప్రతిభా ఆసుపత్రిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

సాయాజీ షిండే ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్‌ మాట్లాడారు. ‘సాయాజి షిండే కొద్ది రోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు పరీక్షలు చేయగా.. గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ తప్పదని చెప్పాం. షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేసుకుని.. చికిత్స కోసం ఆయన రెడీ అయ్యారు. ముందుగానే జాగ్రత్తపడటంతో సర్జరీ విజయవంతంగా పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తాం’ అని సోమనాథ్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న అభిమానులు సాయాజీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Also Read: Rohit Sharma-Dinesh Karthik: ప్రపంచకప్ కోసమే ఆడుతున్నావ్ కదా.. కార్తీక్‌ను టీజ్ చేసిన రోహిత్!

సాయాజీ షిండే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గుడుంబా శంకర్‌, ఆంధ్రుడు, అతడు, టాగూర్, లక్ష్మి, ఆట, దుబాయ్‌ శీను, పోకిరి, అరుంధతి, సోలో, సూపర్, కృష్ణ, మిస్టర్‌ పర్ఫెక్ట్‌, దూకుడు, బిజినెస్‌మెన్‌.. లాంటి సినిమాలో నటించారు. ముందుగా విలన్ పాత్రలు చేసిన సాయాజీ షిండే.. ఆ తరువాత తండ్రి క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశాడు.

Show comments