Site icon NTV Telugu

Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Actor Rajasekhar

Actor Rajasekhar

Actor Rajasekhar: టాలీవుడ్ సీనియర్ హీరో, ‘యాంగ్రీ మ్యాన్’ రాజశేఖర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెండితెరపై పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, యాక్షన్ హీరోగా మెప్పించే ఆయనకు ఒక విషయంలో మాత్రం విపరీతమైన భయం, అసహ్యం ఉందట. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరో అంటే ఫైట్లు మాత్రమే కాదు, అదిరిపోయే స్టెప్పులు కూడా వేయాలి. కానీ, తనకు డాన్స్ అంటే అస్సలు పడదని రాజశేఖర్ కుండబద్దలు కొట్టారు. “నాకు సహజంగా రిథమ్ ఉండదు. అందుకే పాటల్లో మూవ్‌మెంట్స్ చేయడం నాకు చాలా కష్టంగా అనిపించేది. నిజం చెప్పాలంటే నాకు డాన్స్ అంటే ఒక రకమైన ద్వేషం ఉండేది” అని ఆయన ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు.

READ ALSO: 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాన్స్ రాకపోయినా, ఇండస్ట్రీలో హీరోగా కొనసాగాలంటే డాన్స్ తప్పనిసరి కాబట్టి చాలా కష్టపడ్డానని వివరించారు. కొరియోగ్రాఫర్లు చెప్పిన స్టెప్పులను గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. “చాలా ఏళ్ల పాటు ఇలా కష్టపడి డాన్స్ చేయడం వల్ల, ఇప్పుడు ఆ సీక్వెన్స్‌లు చేయడం కాస్త సులభమైంది. అది ఇప్పుడు నాకు అలవాటైపోయింది” అని చెప్పుకొచ్చారు. యాక్షన్ సీన్లలో అదరగొట్టే రాజశేఖర్, తన బలహీనతను ఇంత ధైర్యంగా, సరదాగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఇంటర్వ్యూ క్లిప్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. “రాజశేఖర్ గారి నిజాయితీకి హ్యాట్సాఫ్.. మీరు డాన్స్ చేసినా చేయకపోయినా మాకు ఎప్పుడూ హీరోనే” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ వసూళ్ల గర్జన.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌కు!

Exit mobile version