NTV Telugu Site icon

Prakash Raj Birthday: సినిమాలు, రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

Prakash

Prakash

తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. విలక్షణ నటుడుగా ఎన్నో పాత్రల్లో నటించి అందరి మనసును చూరగోన్నాడు.. హీరోగా, ఫ్రెండ్ గా, అన్నగా, తండ్రిగా, తాతగా ఇలా ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తాడు. గత ముప్పై ఏళ్లుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఏడు ప్రధాన భారతీయ భాషల్లో దాదాపు నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. నటుడిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు..

ఆయన సినిమాలతో పాటుగా తనకు సంబంధం లేని విషయాలపై స్పందిస్తూ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తూ వస్తుంటాడు.. నిత్యం వార్తల్లో ఆయన పేరు వినిపిస్తుంది.. సోషల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉండే ప్రకాష్ రాజ్ ఎన్నో విషయాల గురించి ఫ్యాన్స్ తో పంచుకుంటాడు.. ఆయన నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈరోజు ఆయన సినిమాలు, రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకాష్ రాజ్ కర్ణాటకలో జర్మించారు..రంగ స్థల నటుడుగా ఎన్నో షోలు చేశాడు.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడకు ఎంట్రీ ఇచ్చాడు.. కేరీర్ మొదట్లో కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన ప్రకాశ్ రాజ్.. 1994లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డ్యూయెట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. సంకల్పం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ తర్వాత ఆయన తెలుగులో వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు.. ఇప్పటికి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. హ్యాపీ బర్త్ డే..