NTV Telugu Site icon

Actor Naresh: నరకయాతన అనుభవిస్తున్నా.. విడాకులు ఇప్పించండి..

Naresh

Naresh

Actor Naresh: సీనియర్ యాక్టర్‌ నరేష్ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ బయటికి వచ్చింది. తాజాగా మాజీ భార్యపై నరేష్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనకు తన మాజీ భార్య రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో ప్రాణ హాని ఉందని కోర్టును ఆశ్రయించారు నరేష్. తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని.. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారని నరేష్ వెల్లడించారు. ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని.. ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. తనను చంపడానికి సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకుందని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌లో కొంతమంది ఆగంతుకులు తన ఇంట్లో చొరబడ్డారన్నారు.

24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయమాటలు చెప్పారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని నరేష్ వెల్లడించారు. తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసిందని ఆరోపించారు. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేపించి బెదిరించిందన్నారు. చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదని నటుడు నరేష్ చెప్పారు. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుని.. తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి పర్సనల్‌ మెసేజ్‌లు చూసేదని ఆరోపించారు. రమ్య వల్ల నరకయాతన అనుభవించానన్న నరేష్.. ఆమె వేధింపులు భరించలేకపోతున్నానన్నారు. కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Burnt Car: ప్రియురాలిపై కోపంతో బెంజ్ కారు తగలబెట్టిన ప్రియుడు

2010 మార్చి 3 న బెంగుళూరులో రమ్యతో నరేష్‌ వివాహం జరిగింది. పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదని నరేష్‌ తెలిపారు. రమ్యకు అమ్మ విజయ్ నిర్మల 30 లక్షల బంగారం చేయించిందని నరేష్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. పెళ్లి అయిన కొన్ని నెలల నుంచే తన వేధింపులు మొదలయ్యాయన్నారు. తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు పెట్టిందన్నారు. రమ్యకు తనకు 2012లో రణ్వీర్ జన్మించాడని నరేష్ చెప్పుకొచ్చారు. తనకు తెలియకుండానే పలు బ్యాంకులు, పలువురి వ్యక్తుల దగ్గర రమ్య డబ్బు తీసుకుందని.. తన పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిందన్నారు. అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు చెల్లించానని.. కుటుంబ సభ్యుల నుంచి రమ్య మరో 50 లక్షలు తీసుకుందన్నారు. ఇక తనవల్ల కాదన్న నరేష్.. తనకు రమ్యతో విడాకులు కావాలని కోర్టును కోరారు.

Show comments