NTV Telugu Site icon

Mohan Babu: గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

Mohanbabu (2)

Mohanbabu (2)

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. రేపు ఇంతకన్నా మంచి పని ఏం చేయాలని ఆలోచిస్తాను. భారతదేశానికి రైతు వెన్నుముక, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా వృత్తిలో సినిమా హిట్ అయితేనే నిజమైన పండుగ. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుంది’ అని మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: R Ashwin Retirement: అశ్విన్‌ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆసీస్ మాజీ క్రికెటర్!

గత కొన్ని రోజులుగా మోహన్‌ బాబు ఇంట్లో వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. మోహన్‌ బాబు, మనోజ్‌ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జల్‌పల్లిలోని ఇంటి వద్దకు వెళ్లగా.. ఆ సమయంలో జర్నలిస్టు రంజిత్‌పై కలెక్షన్ కింగ్ మైక్‌తో దాడి చేశారు. దీంతో జర్నలిస్టు పహడీ షరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించిన కేసులో మోహన్‌ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో.. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వబోమని కోర్టు తెలిపింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Show comments