NTV Telugu Site icon

Mohan Babu: మళ్లీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు!

Mohanbabu

Mohanbabu

‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. డిసెంబర్ 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి మోహన్ బాబు చేరుకున్నారు. బుధవారం (డిసెంబర్ 18) సాయంత్రం శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. కలెక్షన్ కింగ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

జల్‌ప‌ల్లిలో ఉన్న త‌న నివాసంలో జర్నలిస్ట్‌పై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. బాధితుడు జర్నలిస్ట్‌కు బాబు క్షమాపణ చెప్పినప్పటికీ.. కేసు ఇంకా న్యాయస్థానంలో ఉంది. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ లోగా అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బాబు తరఫు న్యాయవాది కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్‌ చేస్తారని మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు.