Site icon NTV Telugu

Madhavan : పుత్రోత్సాహంతో మాధవన్.. 5బంగారు పతకాలు సాధించిన కొడుకు

Madhavan

Madhavan

Madhavan : ప్రముఖ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. తన కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ కాంపిటిషన్‌(ఈత పోటీల్లో)లో ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో వేదాంత్ భారత్‌కు ఐదు బంగారు పతకాలు(50 మీటర్లు, 100, 200, 400, 1500 విభాగాల్లో) సాధించాడు. కౌలాలంపూర్‌లో జరిగిన మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్ షిప్‌లో ఈ పతకాలను గెలుచుకున్నాడు’’ అంటూ మాధవన్ ఇన్‌స్టా గ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో.. మాధవన్‌ కొడుకుకు అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు మాధవన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Jangaon dabal bedroom: ఓపిక నశించి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు

వేదాంత్ మాధవన్ గతంలోనూ పలు స్విమ్మింగ్ టోర్నమెంట్లలో తన సత్తా చాటుకున్నాడు. గత కొన్ని ఏళ్లుగా పలు ప్రఖ్యాత పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీం మహారాష్ట్ర తరపున ఖేలో ఇండియా 2023లో పాల్గొన్న వేదాంత్ ఐదు బంగారం, రెండు వెండి పతకాలను గెలుచుకున్నాడు. గతేడాది జరిగిన 48వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో మాధవన్ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు.

Exit mobile version