NTV Telugu Site icon

Darshan Judicial Custody Extended: నటుడు దర్శన్, సహచరుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

Darshan

Darshan

Darshan Judicial Custody Extended: అభిమాని హత్య కేసులో తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ దర్శన్‌ తోపాటు అతని సహచరులకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీని ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ నిమిత్తం దర్శన్ తోపాటు ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు, దర్శన్ భాగస్వామి పవిత్ర గౌడను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి విచారణ చేసారు.

Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల యువకుడిని అరెస్టు..

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్‌ ను జూన్ 11న పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడను రేణుకాస్వామి కించపరిచేలా, అసభ్యకరమైన సందేశం పంపారని ఆరోపించారు. దర్శన్, అతని భాగస్వామి పవిత్ర గౌడ, అతని 13 మంది సహచరులు బెంగళూరు శివార్లలోని పరపప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో ఉండగా.. మరో నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.

Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!

Show comments