టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా కూడా చేసి మెప్పించారు.. ఆ తర్వాత కమెడియన్ గా రానిస్తున్నాడు.. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కమెడీయన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. తన కొడుకును కూడా హీరోగా పరిచయం చేశాడు.. ఆయన యంగ్ లుక్ గురించి తెలిసిందే.. తాజాగా ఏపీ ఎలెక్షన్స్ పై సంచలన కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు..
బ్రహ్మాజీ ఏదైన ఖచ్చితంగా చెబుతాడు.. తన మనసులో అనుకున్న మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.. ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తాడు.. ఆయన చెప్పే విధానం అందరికీ నచ్చడంతో చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫాలో అవుతున్నారు.. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పాడు.. బ్రహ్మాజీ ఏపీ ఎలక్షన్స్ పై సంచలనమైన ట్వీట్ చేశాడు. ఏపీ పాలిటిక్స్ చెత్తగా ఉన్నాయని అర్ధం వచ్చేలా మాట్లాడాడు.. ఆ రాజకీయాలు చూస్తే వాంతులు వచ్చేలా అసహ్యంగా ఉంది.. శ్రీ బూతు పురాణం అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు.. ఒకవైపు సినీ నటులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే బ్రహ్మాజీ మాత్రం ఇలా ట్వీట్ చెయ్యడం పై నెట్టింట చర్చనీయాంశంగా మారింది..
Disgusting.. feel like vomiting.. శ్రీ
బూతు పురాణాలు ..🤮#APElections2024 #AndhraPolitics 🙏🏼— Brahmaji (@actorbrahmaji) May 10, 2024