Site icon NTV Telugu

Ajith Kumar: వర్త్ వర్మ వర్త్.. అజిత్ గ్యారేజ్‌లోకి కొత్త చెవ్రోలెట్ కార్వెట్ C8 Z06 రోడ్‌స్టర్.. ధర ఎంతంటే?

Ajith Kumar

Ajith Kumar

Ajith Kumar: ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కేవలం నటనతోనే కాకుండా.. కార్ల అభిరుచి, మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఉన్న ఇష్టంతో కూడా మరింత ప్రసిద్ధి చెందారు. ఆయన గ్యారేజ్‌లో ఇప్పటికే అనేక లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. అయినా కానీ తాజాగా ఆయన తన కలెక్షన్‌లోకి మరో ప్రత్యేకమైన మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్ కారును చేర్చుకున్నారు. అదే చెవ్రోలెట్ కార్వెట్ C8 Z06 రోడ్‌స్టర్. ఈ Z06 వెర్షన్, ప్రొడక్షన్ వాహనాల్లో నేచురల్లి ఆస్పిరేటెడ్ V8 ఇంజిన్‌తో వచ్చిన హై-పర్ఫార్మెన్స్ మోడల్‌గా ప్రసిద్ధి పొందింది. ఇది రేస్ ట్రాక్‌పైనే కాకుండా హైవేపై కూడా మంచి డ్రైవింగ్ ఆనందాన్ని అందిస్తుంది.

Honor X7c 5G: SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 300% హై వాల్యూమ్ మోడ్‌‌తో విడుదలకు సిద్దమైన కొత్త స్మార్ట్‌ఫోన్!

ఆయన దుబాయ్‌లోని ఓ డీలర్‌షిప్ నుంచి అజిత్ కుమార్ ఈ కారును కొనుగోలు చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఇక దీని ధర 624,800 AED. అంటే భారత కరెన్సీలో సుమారు 1.4 కోట్లు. సదరు వీడియోలో మొదట ఈ కారును డెలివరీ చేస్తున్న సందర్బంగా ప్రత్యేక అలంకరణతో ఉన్నట్లు కనిపిస్తుంది. అనంతరం అజిత్ కుమార్ షోరూంలోకి వచ్చి తన కొత్త కారును పరిశీలిస్తూ, సిబ్బందితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తుంది. ఆ తర్వాత వాహనానికి పైకప్పు తీయడంతో కన్వర్టిబుల్ వెర్షన్ అని తేల్చేసారు. చెవ్రోలెట్ దుబాయ్‌లో కూపే, రోడ్‌స్టర్ వెర్షన్‌లను విక్రయిస్తుంది. చివరగా అజిత్ కుమార్ వాహనాన్ని స్టార్ట్ చేసి డీలర్ యార్డ్‌ నుంచి హైవేపైకి తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తాయి.

Infinix Hot 60i 5G: మార్కెట్‌ను ఏలడానికి సిద్దమైన ఇన్‌ఫినిక్స్‌.. 6,000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల డిస్ప్లేతో రాబోతున్న కొత్త ఫోన్!

చెవ్రోలెట్ కార్వెట్ C8 Z06 ప్రత్యేకతలు:
చెవ్రోలెట్ 2021లో C8 కార్వెట్ Z06ను ఆవిష్కరించింది. “C8” అంటే ఈ కార్వెట్ ఎనిమిదవ తరం అని అర్థం. ఈ కారు ప్రధాన ఆకర్షణ దీని కొత్త ఇంజిన్. ఆ సమయంలో ప్రపంచంలోనే అద్భుత నేచురల్లి ఆస్పిరేటెడ్ V8. LT5 V8 పేరుగల ఈ ఇంజిన్, చెవ్రోలెట్ IMSA C8-R రేస్ కార్ల నుండి ప్రేరణ పొందినది. ఫ్లాట్-ప్లేన్ క్రాంక్, షార్ట్ స్ట్రోక్, తేలికైన నిర్మాణంతో ఇది గరిష్టంగా 8,600 RPM వరకు రేవ్ అవుతుంది. దీని శక్తి 660BHP, టార్క్ 624Nm. ట్రాన్స్‌మిషన్‌గా ట్రెమెక్ తయారు చేసిన 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ అమర్చబడింది.

Exit mobile version