NTV Telugu Site icon

Koregaon-Bhima Violence Case: జైలు నుంచి ఉద్యమకారుడు గౌతమ్ నవ్‌లఖా విడుదల.. గృహ నిర్బంధం

Activist Gautam Navlakha

Activist Gautam Navlakha

Koregaon-Bhima Violence Case: కోరేగావ్-భీమా కేసులో 2020 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 70 ఏళ్ల కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖాను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వైద్య కారణాలపై గౌతమ్‌ అప్పీల్ చేసిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వాదనను తోసిపుచ్చుతూ కోర్టు శుక్రవారం తన ఉత్తర్వులను పునరుద్ఘాటించింది.

నవీ ముంబైలోని తన ఇంట్లో ఉండనున్న గౌతమ్‌ నవ్‌లఖాను పోలీసులకు అప్పగించారు. ఆయన సీపీఎం కార్యాలయంలో ఉండాలన్న అతని బృందం ప్రతిపాదనపై ఎన్‌ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 1న మహారాష్ట్రలోని కోరేగావ్-భీమాలో జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కార్యకర్త ఏప్రిల్ 2020 నుంచి జైలులో ఉన్నారు. ఎల్గార్ పరిషత్ కాంక్లే్వ్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఒక రోజు తర్వాత హింసలో ఒకరు మరణించారు. ఈ సమ్మేళనానికి మావోయిస్టుల మద్దతు ఉందని పుణె పోలీసులు ప్రకటించారు.గత వారం గౌతమ్‌ నవ్‌లఖాను 48 గంటల్లో గృహనిర్బంధానికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ విడుదల ఆలస్యమైంది, దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్‌ఐఏ కోర్టు ఆదేశాలను అమలుచేయడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపించింది. గౌతమ్‌ నవ్‌లఖాకు ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణల దృష్యా భద్రత గురించి ఎన్‌ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. తన నిర్ణయాన్ని సవరించాలని ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీ సుప్రీంకోర్టును కోరింది. అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడిపై పోలీసులు నిఘా ఉంచలేరా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్‌ఐఏ సోమవారం వరకు సమయం కోరగా.. కేసును ఆలస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. ఇద్దరు అరెస్ట్

గతంలో కూడా బీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న సామాజిక కార్యకర్త స్టాన్ స్వామికి గతంలో ఎన్ఐఏ బెయిల్ మంజూరు చేయలేదు. పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు చివరకు ఆహారం తీసుకోవడానికి కనీసం సిప్పర్ కూడా అనుమతించకపోవడం పట్ల విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు తీవ్ర అనారోగ్య కారణాల దృష్ణ్యా ఆయన బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ స్వామి న్యాయవాదులు బాంబే కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం విచారణ ప్రారంభించేలోగా ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే వైద్యపరమైన రుగ్మతలకు నిశ్చయాత్మక రుజువు లేదని ఎన్‌ఐఏ వాదించింది.

Show comments