NTV Telugu Site icon

Acrobat : జిమ్నాస్టిక్ చేస్తు 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన భార్య.. మరి భర్త పరిస్థితి..?

China

China

భార్యభర్తలిద్దరూ లైవ్ లో జిమ్నాస్టిక్ చేస్తుండగా అనూహ్యా ఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కలిసి ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. అలాంటిది అనుకోకుండా ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు కమ్ముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనీస్ అక్రోబాట్ జిమ్నాస్టిక్ ప్రదర్శనలో భాగంగా ఒక స్టంట్ చేస్తున్నారు. లైవ్ లో ఎప్పుడూ రోటిన్ గా తన భాగస్వామితో చేసే స్టంట్ చేస్తోంది. ఈ మేరకు ఆమె సెంట్రల్ అన్హుయ్ ప్రావిన్స్ లోని సుజౌ నగరంలో ప్లయింట్-ట్రాపెజ్ ప్రదర్శనలో భాగంగా లైవ్ లో విన్యాసం చేస్తుండగా.. అనుహ్యంగా 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది.

Also Read : Mysore Fire Accident: మైసూరులో భారీ అగ్నిప్రమాదం.. ఏకంగా రెండు కీలోమీటర్ల మేర..

దీంతో ఆమె భాగస్వామి కాళ్లతో అమెను పట్టుకోవడంలో విఫలమవ్వడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో హుటాహూటినా ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే సదరు మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని సమాచారం. ఆ భార్యభర్తలిద్దరూ ఇలాంటి ప్రదర్శనలు చాలా సార్లు ఇచ్చారని.. పైగా ఎప్పుడూ కూడా బెల్ట్ లు లేకుండానే చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగేకంటే ముందు ఇద్దరు గొడవపడ్డారిన.. ఆ మహిళ సేఫ్టి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పినా.. నిరాకరించిందని సమాచారం. అయితే ఆమె భర్త మాత్రం ఆ వ్యా్ఖ్యలను ఖండించారు. తాము ఎప్పుడూ అనోన్యంగా ఉండేవాళ్లమని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

Also Read : Viral Video: ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఆవు.. వీడియో వైరల్