Site icon NTV Telugu

ACP Umamaheshwar Rao : ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వర రావు

Acp Umamaheshwar Rao

Acp Umamaheshwar Rao

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ను కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టు లో పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో మూడు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. అధికారులు అతడిని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఉమా మహేశ్వరరావు, మరికొందరు అవినీతి అధికారులతో కలిసి అక్రమాస్తుల పేర్లు, పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉమామహేశ్వర్‌రావు టీమ్ సీసీఎస్‌లో హై ప్రొఫైల్‌ కేసులను మాత్రమే టార్గెట్‌ చేసిందని, ఉమామహేశ్వర్‌రావు పలు కేసుల్లో సెటిల్‌మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వర్ రావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

 

Exit mobile version